ఐదు చిత్రాలతో సునీల్ బిజీ బిజీ
Send us your feedback to audioarticles@vaarta.com
హాస్యనటుడిగా తెలుగు తెరపై తనదైన సంతకం చేశారు సునీల్. ఆ తర్వాత హీరోగా కూడా మారి.. చెప్పుకోదగ్గ విజయాలను అందుకున్నారు. అయితే గత నాలుగు సంవత్సరాల నుంచీ ఈ కామెడీ హీరోకి ఏదీ కలిసి రాలేదు. ఒక్కటంటే ఒక్క విజయం కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు ఈ భీమవరం బుల్లోడు. వరుస పరాజయాలతో డీలా పడ్డ సునీల్.. మళ్లీ తన పాత పంథాలోకి రానున్నారు. వరుసగా ఐదు చిత్రాలలో కామెడీ పాత్రలు చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' లో కమెడీయన్‌గా నటిస్తున్నారు సునీల్. అలాగే.. రవితేజ, శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు.. వెంకటేష్, తేజ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూవీలో కూడా సునీల్ కామెడీ పాత్రలను పోషిస్తున్నారని తెలిసింది. కెరీర్ ఆరంభంలో శ్రీను వైట్లతో 'సొంతం' , తేజతో 'నువ్వు నేను' సినిమాలు చేసిన సునీల్.. ఆ చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సంగతి తెలిసిందే.
ఈ మూడు చిత్రాలే గాక మరో రెండు చిత్రాల్లో కూడా సునీల్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి తనకి అచ్చొచ్చిన పాత్రలతో.. రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెడుతున్న సునీల్ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com