నేను క్షత్రియ, త్రివిక్రమ్ బ్రాహ్మిణ్ , రామోజీరావు గారు చౌదరి....అందుచేత నేను కులాల గురించి పట్టించుకోను - సునీల్

  • IndiaGlitz, [Tuesday,October 04 2016]

క‌మెడియ‌న్ గా కెరీర్ ప్రారంభించి...త‌న న‌ట‌న‌తో అంద‌ర్నీ క‌డుపుబ్బా న‌వ్వించి...ఆత‌ర్వాత క‌థానాయ‌కుడుగా మారి విజ‌యాలు సాధిస్తున్న క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్. ఈ సంవ‌త్స‌రంలో కృష్ణాష్ట‌మి, జ‌క్క‌న్న చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సునీల్ తాజాగా ఈడు గోల్డ్ ఎహే అనే చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. వీరు పోట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈడు గోల్డ్ ఎహే చిత్రం ద‌స‌రా కానుక‌గా ఈనెల 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఈడు గోల్డ్ ఎహే సునీల్ తో స్పెష‌ల్ ఇంట‌ర్ వ్యూ మీకోసం...!
ఈడు గోల్డ్ ఎహే సినిమా గురించి ఏం చెబుతారు..?
ఈ సినిమా ఆక‌లితో ఉన్న‌వాడికి పెళ్లి భోజ‌నం లాంటిది. అలాగే ఈ సినిమా చూసిన‌వాడికి, చేసిన‌వాడికి కూడా సంతృప్తి క‌లిగించే సినిమా. అందాల రాముడు, పూల‌రంగ‌డు, భీమ‌వ‌రం బుల్లోడు, జ‌క్క‌న్న ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో ఆడియోన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అయితే...మ‌ర్యాద రామ‌న్న సినిమా అలా కాదు చివ‌రి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్ ఉంటుంది. మ‌ర్యాద రామ‌న్న సినిమా వ‌లే నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్ క్రియేట్ చేసే డిఫ‌రెంట్ ఫిల్మ్ ఈడు గోల్డ్ ఎహే.
ఈడు గోల్డ్ ఎహే టైటిల్ వెరైటీగా ఉంది. మీకు యాప్ట్ గా ఉంటుంద‌ని ఈ టైటిల్ పెట్ట‌మ‌ని మీరే చెప్పారా..?
ఓరోజు వీరు పోట్ల ఫోన్ చేసి నా ఫోటోస్ పంప‌మంటే పంపించాను. ఆత‌ర్వాత నా ఫోటోస్ తో ఈడు గోల్డ్ ఎహే టైటిల్ డిజైన్ చేసి పంపించారు. ఈ టైటిల్ తో ఉన్న పోస్ట‌ర్ చూడ‌గానే నా స్లాంగ్ తో టైటిల్ పెట్టాడు అనిపించింది. టైటిల్ ప‌లికితేనే న‌వ్వు వ‌స్తుంది. అందుక‌నే వెంట‌నే ఓకే అని చెప్పాను అంతే కానీ...ఈ టైటిల్ నేను పెట్ట‌లేదు ఇలా పెట్ట‌మ‌ని చెప్ప‌లేదు..!
ఈ మూవీలో చాలా మంది క‌మెడియ‌న్స్ ఉన్న‌ట్టున్నారు..?
అవునండి..! ఇంత మంది క‌మెడియ‌న్స్ తో సినిమా చేయ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ అనుకుంట‌. ఇంత మంది క‌మెడియ‌న్స్ ఉంటే...ఇక కామెడీ ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈ సినిమాలో ప‌బ్ సీన్ ఉంటుంది. ఆ ప‌బ్ కి వీరు పోట్ల పెట్టిన పేరు డాడ్స్ క్యాష్ ప‌బ్. ఇలా...ప్ర‌తి ఫేమ్ లో న‌వ్వించ‌డానికి ప్ర‌య‌త్నించాం.
ఇందులో మీ క్యారెక్ట‌ర్ కి టు షేడ్స్ ఉంటాయ‌ని విన్నాం నిజ‌మేనా..?
ఈ విష‌యాన్ని మేము రివీల్ చేయ‌కూడ‌దు అనుకున్నాం. మీరు అడిగారు కాబ‌ట్టి చెబుతున్నాను..నా క్యారెక్ట‌ర్ లో టు షేడ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది మాత్రం నేను చెప్ప‌ను స్ర్కీన్ పైనే చూడాలి.
డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్..?
వీరు పోట్ల వెరీ ఇంట్లిజంట్. ఆడియోన్స్ చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ ఫీల‌య్యేలా డిఫ‌రెంట్ స్ర్కిప్ట్ తో ఈ మూవీని తెర‌కెక్కించాడు. అలాగే ప్ర‌తి ఫేమ్ లో కామెడీ ఉంటుంది. ఈ సినిమాకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ వీరు పోట్ల‌. నాలో మంచి న‌టుడుని బ‌య‌ట‌కు తీసాడు. అలాగే నాలోని కొత్త యాంగిల్ చూపించాడు. వీరు పోట్ల గురించి ఇంకా చెప్పాలంటే....మా ఫ్రెండ్ షిప్ ఇప్ప‌టిది కాదు. కెరీర్ బిగినింగ్ నుంచి వీరు పోట్ల నాకు మంచి ఫ్రెండ్. మా రూమ్ ప‌క్క‌నే ఉండేవాడు. ఇండ‌స్ట్రీలో నా ఫ్రెండ్స్ చాలా మంది మంచి స్ధాయిలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ లో త్రివిక్ర‌మ్ త‌ర్వాత నాతో సినిమా చేసింది వీరు పోట్ల‌నే.
జ‌క్క‌న్న రిజ‌ల్ట్ తో మీరు హ్య‌పీయేనా..?
చాలా హ్యాపీ. జ‌క్క‌న్న పాస్ అయితే చాలు అనుకున్నాం. సెకండ్ క్లాస్ లో పాస‌య్యాం. సో...వెరీ హ్యాపీ..!
క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తున్నారు క‌దా...? క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తున్న‌ప్పుడు మీకు ఏమ‌నిపిస్తుంది..?
క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌డం చాలా క‌ష్టం. దీనికంటూ ఒక ఫార్మెట్ ఉంటుంది. అదే ఫార్మెట్ లో అంద‌ర్నీ ఎంట‌ర్ టైన్ చేయ‌డం క‌ష్టం. నా అభిప్రాయం ప్ర‌కారం ఫ్లాప్ వ‌చ్చిన‌ప్పుడే ఆర్టిస్ట్ ద‌మ్ము తెలుస్తుంది. ఇక ఆర్టిస్ట్ ద‌మ్ము పెరిగేది కొత్త సినిమాతో..!
మీకు న‌ట‌న‌లో స్పూర్తి ఎవ‌రు..?
నేను విల‌న్ అవుదామ‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. మోహ‌న్ బాబు గారు, కోట శ్రీనివాస‌రావు గారులా విల‌న్ గా చేయాలి అనుకున్నాను. కానీ కుద‌ర‌లేదు. నాకు కోట‌, శ్రీదేవి ఏక్టింగ్ అంటే బాగా ఇష్టం. అందుకే వాళ్లిద్ద‌రినీ ఫాలో అవుతాను. కోట, శ్రీదేవి మిక్స్ చేస్తే సునీల్.
మ‌రి...విల‌న్ గా ఎప్పుడు న‌టిస్తారు..?
వ‌చ్చే సంవ‌త్స‌రం విల‌న్ గా న‌టిస్తాను. అయితే...తెలుగు సినిమాలో కాదు. వేరే లాంగ్వేజ్ లో విల‌న్ గా న‌టిస్తాను. తెలుగులో ఎందుకు విల‌న్ గా చేయ‌ను అంటున్నాను అంటే...నేను ఇక్క‌డ క‌మెడియ‌న్ గా చేసాను కాబ‌ట్టి విల‌న్ గా న‌టిస్తే చూడ‌క‌పోవ‌చ్చు. అందుక‌నే వేరే భాష‌లో విల‌న్ గా న‌టించాలి అనుకుంటున్నాను.
క‌మెడియ‌న్ గా, హీరోగా రెండింటిలో మీరు హ్యాపీగా ఫీల‌య్యేది ఎందులో..?
నేను ఏక్టింగ్ చేస్తున్నాను. హీరో అనే పేరు త‌ప్పితే పెద్ద‌గా తేడా ఏమీ లేదు. క‌మెడియ‌న్ గా డైలీ 5 సినిమాలు చేసేవాడిని. హీరోగా సంవ‌త్స‌రానికి నాలుగు సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. కాక‌పోతే...ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుండ‌డంతో మా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఫీల‌వుతున్నారు.
మెగాస్టార్ ఖైదీ నెం 150లో న‌టిస్తున్నారా..?
ఈ మూవీలో నాకు రోల్ ఇచ్చారు. అయితే...అదే టైమ్ లో ఈడు గోల్డ్ ఎహే క్లైమాక్స్ చేయాలి. అందుచేత ఖైదీ నెం 150లో ఓ క్యారెక్ట‌ర్ మిస్ అయ్యాను. నాతో చేయించాలి అనుకున్న క్యారెక్ట‌ర్ ఆలీ గారు చేసారు. ఇప్పుడు ఖైదీ నెం 150లో వేరే క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. అన్న‌య్య చిరంజీవితో న‌టించ‌డం అంటే ఆ కిక్కే వేరు.
ఇటీవ‌ల ఓ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో యాంక‌ర్ పై ఫైర్ అయ్యారు క‌దా..! అది ముందుగానే అనుకుని చేసిందా..? లేక నిజంగానే ఫైర్ అయ్యారా..?
అనుకుని చేసింది కాదు నిజంగానే ఫైర్ అయ్యాను.
స‌ర‌దాగా ఉండే సునీల్ కి కోపం రావ‌డానికి కార‌ణం ఏమిటి..?
ఇంట‌ర్ వ్యూ ప్రారంభించే ముందే రెగ్యుల‌ర్ గా కాకుండా నేను స్ట్రాంగ్ గా అడుగుతాను మీరు స‌మాధానం చెప్పండి అని చెప్పాడు. మీ ప్ర‌శ్న‌ను బ‌ట్టే నా స‌మాధానం ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కానీ...కెరీర్ బిగినింగ్ లో రెబ‌ల్. అయితే...న‌న్ను ఓ ప్ర‌శ్న అడిగాడు ఆ ప్ర‌శ్న‌కు త‌గ్గ‌ట్టు స‌మాధానం చెప్పాను.
మీ ఫేస్ అద్దంలో చూసుకున్నారా...మీరు హీరో ఏంటి..? ఇదేనా..? లేక కులం గురించి ఏమైనా అడిగారా..?
కులం అనేదాన్ని నేను ఎప్పుడూ ప‌ట్టించుకోను. నేను క్ష‌త్రియ న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హించిన త్రివిక్ర‌మ్ బ్రాహ్మిణ్, అలాగే నాకు అవ‌కాశం ఇచ్చిన రామోజీరావు గారు చౌద‌రి. అన్ని కులాల వాళ్లు ఆద‌రిస్తేనే ఈ స్ధాయికి వ‌చ్చాను. అందుచేత కులాల గురించి ఎప్పుడూ ప‌ట్టించుకోను. నేను సీరియస్ అయ్యాను అంటే న‌న్ను ఇంట‌ర్ వ్యూ చేసే వాళ్లు ఫెయిల్ అయిన‌ట్టు లెక్క‌.
మ‌రి...మీరు ఇంట‌ర్ వ్యూలో న‌వ్వితే...?
న‌న్ను ఇంట‌ర్ వ్యూ చేసే వాళ్లు స‌క్సెస్ అయిన‌ట్టు లెక్క‌.(న‌వ్వుతూ..)
అంటే మీ దృష్టిలో నేను స‌క్సెస్ అయ్యాను అన్న‌మాట‌..?
అవును..! మీరు స‌క్సెస్ అయ్యారు (న‌వ్వుతూ...)
ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీలో చేర‌తారా..?
పార్టీలో చేర‌ను కానీ...నాకు ఏదైనా ప‌ని అప్ప‌గిస్తే చేయ‌డానికి నేను రెడీ..!
స్వ‌చ్ఛంద సంస్ధ ఏర్పాటు చేసి సేవా కార్య‌క్ర‌మాలు చేసే ప్లాన్ ఉందా..?
నాకు ఆ ఆలోచ‌న ఉందండి. మాన‌సిక ఎదుగుద‌ల లేని 10 మంది పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోవాలి అనుకుంటున్నాను. వాళ్ల‌కు చ‌దువు ఉద్యోగం అన్నీ నేను చూసుకుంటాను. ఎవ‌రి ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకోకుండా నా సొంత డబ్బులుతోనే చేయాలి అనుకుంటున్నాను. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను.
ద‌స‌రాకి నాలుగు సినిమాలు వ‌స్తున్నాయి. మీ పోటీలో మీ సినిమా ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది అనుకుంటున్నారు..?
నా సినిమా ఎవ‌రికీ పోటీ కాదు.నా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అనేది నా న‌మ్మ‌కం. అలాగే మిగిలిన సినిమాలు కూడా బాగా ఆడాలి అని కోరుకుంటున్నాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 30% షూటింగ్ అయ్యింది. క్రాంతి మాధ‌వ్ గ్రేట్ డైరెక్ట‌ర్. న‌వంబ‌ర్ లో టు కంట్రీస్ స్టార్ట్ అవుతుంది.