సందీప్ కిషన్ ను భయపెట్టిన పార్శిల్..!

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ కు ఓ పార్శిల్ వ‌చ్చింది. ఆ పార్శిల్ చూసిన త‌ర్వాత న‌వ్వాలో, భ‌య‌ప‌డాలో తెలియ‌డం లేదు అంటూ ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. ఇంత‌కీ ఏం జ‌రిగింది అంటే....ఎవ‌రో సందీప్ కిష‌న్ అడ్ర‌స్, ఫోన్ నెంబ‌ర్ యాడ్ చేసి అమెజాన్ లో ఓ ఆర్డ‌ర్ ఇచ్చార‌ట‌. ఆ డెలివ‌రీ సందీప్ కిష‌న్ ఇంటికి రావ‌డంతో ఎవ‌రు ఆర్డ‌ర్ చేసార‌బ్బా అని ఆశ్చ‌ర్య‌పోతున్నాడు. అమెజాన్ డెలివ‌రీ బాయ్ ఫోన్ చేసి పార్శిల్ తీసుకోండి మీ ఇంటి బ‌య‌ట ఎదురు చూస్తున్నాను అని ఫోన్ చేయ‌గానే సందీప్ కిష‌న్ ఇంటికి వెళ్లాడ‌ట‌. పార్శిల్ తీసుకున్న త‌ర్వాత ఎవ‌రు ఆర్డ‌ర్ చేసారాని ఆలోచిస్తున్నాడ‌ట సందీప్.
అయితే...త‌న ఫ్రెండ్స్ ఎవ‌రూ ఇలా చేసి ఉండ‌రు. ఎందుకంటే...త‌న ఫోన్ నెంబ‌ర్, అడ్ర‌స్ ఇలా ఇవ్వ‌రు క‌దా అనేది సందీప్ ఆలోచ‌న‌. ఇంత‌కీ ఆ పార్శిల్ లో ఏమున్నాయి అంటే...క్రిస్మ‌స్, హ్యాపీ న్యూయ‌ర్ చెబుతూ గ్రీటింగ్ కార్డ్ & ఓ పొట్టి ఫ్యాంటు ఉన్నాయి. సందీప్ కిష‌న్ ను భ‌య‌పెట్టిన ఆ పార్శిల్ పంపించింది ఎవ‌రో..? త్వ‌ర‌లో తెలుస్తుందేమో చూద్దాం..!