సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ బి.ఎ., బి.ఎల్'... మే 7న ఫస్ట్ లుక్
- IndiaGlitz, [Friday,April 26 2019]
సందీప్ కిషన్ నటిస్తున్న చిత్రం 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్'. తెలుగు, తమిళంలో ఏక కాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మే 7న విడుదల కానుంది. తెలుగు, తమిళంలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక నాయికగా నటిస్తున్నారు.
పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సినిమాతో తెలుగులోకి పరిచయమవుతున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'కు సాయికార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక సమయంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.