Tamil »
Cinema News »
సందీప్ కిషన్ - మెహరీన్ కౌర్ జంటగా సుసీంధరన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రారంభం!
సందీప్ కిషన్ - మెహరీన్ కౌర్ జంటగా సుసీంధరన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రారంభం!
Wednesday, November 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
2013లో చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న "స్వామి రారా"తో నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యువ ప్రతిభాశాలి, "లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్" సంస్థ అధినేత చక్రి చిగురుపాటి అనంతరం "మోసగాళ్లకు మోసగాడు"తో మరో మోడరేట్ హిట్ ను సొంతం చేసుకొన్నారు. తాజాగా మరో యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకురానున్నారు. హీరో సందీప్ కిషన్, "కృష్ణగాడి వీరప్రేమగాధ" ఫేమ్ మెహరీన్ కౌర్ పిర్జాదా జంటగా "నా పేరు శివ" ఫేమ్ సుసీంధరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 9, బుధవారం) హైద్రాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాతలు ఏ.ఎం.రత్నం, శివలెంక కృష్ణప్రసాద్, ప్రముఖ నిర్మాత "జెమిని" కిరణ్, సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల, నీలం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల సినిమా స్క్రిప్ట్ ను చిత్ర బృందానికి అందజేయగా.. హీరోహీరోయిన్లు సందీప్ కిషన్-మెహరీన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎ.ఎం.రత్నం క్లాప్ కొట్టారు, "జెమిని" కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, "జెంటిల్ మెన్" చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాకు చాలా కాలంగా మంచి సన్నిహితుడు, స్నేహితుడు అయిన చక్రి చిగురుపాటి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే..క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో వర్క్ చేస్తున్న టైమ్ లోనే సుసీంధరన్ గారి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. సుసీంధరన్ గారు తెరకెక్కించిన "నా పేరు శివ" సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ను. ఆయన సినిమాలు చాలా నేచురల్ గా ఉంటాయి, ఈ సినిమా కూడా అంతే నేచురల్ గా ఉంటుంది. నా సినిమాకి తమన్ సంగీతం సమకూర్చడం ఇది మూడోసారి, ఎప్పట్లానే ఈసారి కూడా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించాడు అన్నారు.
చిత్ర దర్శకులు సుసీంధరన్ మాట్లాడుతూ.. నా పేరు శివ తరహాలోనే సాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా కూడా ఉంటుంది. మంచి కథ-కథనాలతోపాటు సందీప్ కిషన్, మెహరీన్ లాంటి మంచి నటులు, చక్రి చిగురుపాటి వంటి అద్భుతమైన నిర్మాత తోడవ్వడంతో.. మంచి ఔట్ పుట్ వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగువల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భాషకు తగ్గట్లు వేరువేరుగా చిత్రీకరణ జరపనున్నాం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమా చిత్రీకరణను జనవరి, ఫిబ్రవరిలో ఏకధాటిన పూర్తి చేసి ఏప్రిల్ లేదా మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా అందర్నీ అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను అన్నారు.
చిత్ర కథానాయకి మెహరీన్ కౌర్ పిర్జాదా మాట్లాడుతూ.. ""కృష్ణగాడి వీరప్రేమగాధ" అనంతరం నా రెండో చిత్రంతోనే తమిళనాట అడుగిడుతుండడం, అది కూడా సుసీంధరన్ గారిలాంటి మోస్ట్ ఎఫీషియంట్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించనుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సందీప్ కిషన్ సరసన నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్ కు మైలురాయిగా నిలుస్తుందని నమ్మకం ఉంది అన్నారు.
నటుడు సత్య మాట్లాడుతూ.. సందీప్ కిషన్ గారితో ఇదివరకూ మూడు చిత్రాల్లో నటించాను. ఆయనతో నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని అందరూ అంటుంటారు. ఆ కెమిస్ట్రీ ఈ చిత్రంలోనూ బాగా వర్కవుట్ అయ్యి మంచి ఔట్ పుట్ వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే.. సుసీంధరన్ గారి దర్శకత్వంలో నటించే అవకాశం లభించడం ఆనందంగా ఉంది అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ సందీప్ కిషన్ ఈ సినిమాతో తెలుగు-తమిళ భాషల్లోనూ స్టార్ హీరోగా మారడంతోపాటు, మెహరీన్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం ఖాయమని అతిధులందరూ అభిలషించారు!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments