తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా ఉంటా: సందీప్ కిషన్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం కరోనా మహమ్మారి భారత్‌లో విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ విస్తృత స్థాయిలో విస్తరిస్తోంది. అలాగే మరణాల సంఖ్య కూడా సెకండ్ వేవ్‌లో భారీగానే నమోదవుతోంది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు రంగంలోకి దిగుతున్నారు. కరోనా దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచే ప్రముఖ నటుడు సోనూసూద్ అన్ని రకాలుగా సాయం అందిస్తుండగా.. మరో కన్నడ హీరో అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. అర్జున్ గౌడ 'ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్'.. పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ద్వారానే కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానానికి తరలిస్తున్నారు.
Also Read: మహేష్ సినిమాకు సాయం అందించనున్న వెంకీ కుడుముల
ఇక టాలీవుడ్ యంగ్ హీరో కూడా కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో మంది చిన్నారులు అనాథలవుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఆ చిన్నారులను ఆదుకునేందుకు సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా, ఒంటరైన పిల్లల వివరాలు తనకు తెలియజేయాలని కోరుతున్నాడు. వారికి అండగా ఉంటానని.. వారి ఆలనాపాలన చూస్తానని.. చదువు చెప్పిస్తానని సందీప్ కిషన్ తెలిపాడు.
దీని కోసం ఒక మెయిల్ ఐడీని కూడా క్రియేట్ చేశాడు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు sundeepkishancovidhelp@gmail.comకు తమ వివరాలు తెలియజేయాలని సందీప్ కిషన్ కోరాడు. రెండేళ్ల పాటు వారికి తన సహకారం అందిస్తానని వెల్లడించాడు. సందీప్ కిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. రియల్ హీరో అంటూ సందీప్ కిషన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ప్రస్తుతం... గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.
Please Pass on the word..
— Sundeep Kishan (@sundeepkishan) May 3, 2021
Love you All ❤️
SK pic.twitter.com/tsgRsgJtSz
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout