నా లైఫ్ లో ఇప్పటి వరకు బాగా కష్టపడి చేసిన సినిమా అదే : సందీప్ కిషన్
Send us your feedback to audioarticles@vaarta.com
స్నేహగీతం, ప్రస్ధానం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, గుండెల్లో గోదారి, బీరువా, టైగర్, రన్...ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి యువతలో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్. తాజాగా సందీప్ కిషన్ నటించిన చిత్రం ఒక్క అమ్మాయి తప్ప. ఈ చిత్రంలో సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా నటించారు. రాజసింహ దర్శకత్వంలో రూపొందిన ఒక్క అమ్మాయి తప్ప చిత్రం ఈ నెల 10న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
ఒక్క అమ్మాయి తప్ప ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
2012 డిసెంబర్ లో రాజసింహ కథ చెప్పాడు. కథ నచ్చింది కానీ..కాంప్లికేట్డె స్టోరి కాబట్టి ఇప్పటికి కుదిరింది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే...70% ఫ్లైఓవర్ లో షూటింగ్ చేయాలి. ట్రాఫిక్ జామ్ అవుతుంది. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి. అలాగే పర్మిషన్స్ రావడం కూడా కాస్త ఇబ్బంది అవుతుంది. సిజీతో వర్క్ చేయాలి అది కూడా కన్విన్స్ గా ఉండాలి. ఇంత రిస్క్ ఉన్న సినిమా నాతో చేయాలంటే నిర్మాతలకు కాస్త ధైర్యం కావాలి. కథ మీద, నా మీద ఇప్పటికి నమ్మకం వచ్చిందేమో ఇప్పటికి ఈప్రాజెక్ట్ సెట్ అయ్యింది.
2012లో కథ చెప్పారు కదా..అప్పటికి ఇప్పటికి కథలో ఏమైనా మార్పులు చేసారా..?
మార్పులు ఏమీ చేయలేదు. కాకపోతే...అప్పుడు బేగంపేట ఫ్లైఓవర్ అనుకున్నాం. ఇప్పుడు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై చేసాం అంతే తేడా..!
ఒక్క అమ్మాయి తప్ప చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
చదువు ఇష్టం లేక మధ్యలోనే కాలేజీ మానేసిన యువకుడు కథ ఇది. చదువు మానేసాడని..తెలివితేటలు లేవనుకుంటే పొరపాటే. చదవాల్సింది కాలేజీలో కాదు...జీవితాన్ని అనుకుంటాడు. అందుకనే ఎవర్నైనా చూస్తే...అతను ఎలాంటి వాడో ఇట్టే చెప్పేస్తుంటాడు. ఈ విధంగా ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఉంటుంది.
ఒక్క అమ్మాయి తప్ప కథ ఏమిటి..?
ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరి. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ మధ్య ట్రాఫిక్ జామ్ లో జరిగే కథ ఇది. ఇక్కడ బాంబు ఉంది అని సమాచారం రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఇద్దరు ప్రేమికులకు బాంబు ఉన్నది అనే విషయం తెలియదు. ఈ ఇద్దరు ప్రేమికులు ఆ ట్రాఫిక్ దాటుకుని వాళ్ల సమస్య నుంచి ఎలా బయటపడ్డారనేదే ఈ కథ. ఈ సినిమా 70% ట్రాఫిక్ జామ్ లోనే జరుగుతుంది. స్ర్కీన్ ప్లే చాలా డిపరెంట్ గా ఉంటుంది. ఎక్కడా బోర్ అనేదే ఉండదు. ఆడియోన్స్ కి ఒక కొత్త సినిమాని చూసిన అనుభూతి కలిగిస్తుంది.
70% ట్రాఫిక్ జామ్ లో షూటింగ్ అంటే ఇబ్బంది కదా..ఎలా షూట్ చేసారు..?
నిజమే... 70% ట్రాఫిక్ జామ్ లో షూటింగ్ చేయాలంటే ఇబ్బందే. అందుకనే ఏడురోజులు ఓరిజినల్ గా హైదరాబాద్ హైటెక్ సిటీ లో షూటింగ్ చేసాం. మిగిలిన ట్రాఫిక్ జామ్ సీన్స్ అన్నీ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి నలభై రోజులు పాటు సి.జి వర్క్ చేసాం.
ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోలేదని విన్నాం నిజమేనా..?
నిజమే...రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకోలేదు అంటే..కథ నచ్చింది. కాకపోతే బడ్జెట్ ఎక్కువు అవుతుంది. అందుచేత సినిమా సక్సెస్ అయితే అప్పుడు రెమ్యూనరేషన్ ఇవ్వండి అని ఈ సినిమా చేసాను. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కూడా అలాగే చేసాను.
ఒక్క అమ్మాయి తప్ప టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి..?
చిన్నప్పుడు స్కూల్ లో భారతదేశం నా మాతృభూమి...అంటూ ప్రతిజ్ఞ చేసేవాళ్లం కదా. అలా హీరో తను ప్రేమించే అమ్మాయి తప్ప మిగిలిన వారందరూ తన సిస్టర్స్ అనుకుంటుంటాడు. అందుకనే ఒక్క అమ్మాయి తప్ప అనే టైటిల్ పెట్టాం.
నిత్యామీనన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి..?
నిత్యామీనన్ కి ఈ కథ చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చింది అంటే...కథ విన్న తర్వాత తన సీన్స్ కొన్నింటిని తీసేయమంది. డైరెక్టర్ రాజసింహ తో ఈ సీన్స్ గురించి డిష్కస్ చేసి...ఈ సీన్స్ నాకోసం రాసారా..? నా సీన్స్ తక్కువ ఉన్నా ఫరవాలేదు. కథ ముఖ్యం అంటూ తన సీన్స్ నే తగ్గించమంది. అంతలా నిత్యామీనన్ కి ఈ కథ నచ్చింది. నిత్యా ఎలా నటిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో కూడా పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటించింది.
రైటర్ రాజసింహకి డైరెక్టర్ గా ఈ మూవీ ఫస్ట్ ఫిల్మ్ కదా..ఈ కథను ఆయన తెరకెక్కించిన విధానం గురించి..?
ఇంతకు ముందు చెప్పినట్టుగా 2012లో రాజసింహ ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా ఎప్పుడో చేయాలి... కాకపోతే కాస్త లేట్ అయ్యింది. ఈ కథ చాలా మంది దగ్గరకి వెళ్లింది. కథ విన్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది అన్నారు. కానీ...ఎందుకనే చేయడానికి ముందుకు రాలేదు. చివరకి ఈ కథ మళ్లీ నా దగ్గరకే వచ్చింది. ఈ కథ పై నమ్మకం ఏర్పడ్డానికి మూడు సంవత్సరాలు పట్టింది. మా అంచనాలకు తగ్గట్టు రాజసింహ అందర్నీ ఆకట్టుకునేలా చాలా బాగా తెరకెక్కించారు. ఏడు సంవత్సరాల నుంచి ఈ కథతో రాజసింహ ట్రావెల్ చేస్తున్నారు. మంచి టీమ్ తో చేసిన ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తామనే నమ్మకం ఉంది.
ఒక్క అమ్మాయి తప్ప మీ కెరీర్ లో ఎలాంటి చిత్రంగా నిలుస్తుంది అనుకుంటున్నారు..?
నా కెరీర్లో హయ్యస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంది. ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఒక మంచి చిత్రం చేసాను అని గర్వంగా ఫీలయ్యేలా ఈ చిత్రం ఉంటుంది.
ఒక్క అమ్మాయి తప్ప గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెబుతారు..?
నా లైఫ్ లో ఇప్పటి వరకు బాగా కష్టపడి చేసిన సినిమా ఇది. గొప్ప సినిమా చేయడం కోసం ప్రయత్నించాం. మా ప్రయత్నానికి మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం.
కృష్ణవంశీ నక్షత్రం గురించి..?
కృష్ణవంశీ గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇక్కడో విషయం చెప్పాలి...ఇటీవల ఫేస్ బుక్ చూస్తుంటే...గతంలో కృష్ణవంశీ గారితో ఒక ఫోటో తీయించుకుంటే చాలు అనుకుని ఆయనికి ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాను. అది ఇప్పుడు కనిపిస్తే కృష్ణవంశీ గార్కి చూపించాను. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆయనతో సినిమా చేస్తుండడం చాలా ఆనందంగా ఉంది.ఇక సినిమా విషయానికి వస్తే... పోలీస్ అవ్వాలనుకునే యువకుడు కథ ఇది. కృష్ణవంశీ గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఒక్క అమ్మాయి తప్ప, నక్షత్రం ఈ రెండు చిత్రాలు నా కెరీర్లో టర్నింగ్ పాయింట్స్ గా నిలుస్తాయి.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
తమిళ్ లో ఓ చిత్రం చేస్తున్నాను. ఇది వేదం తరహా లో ఉండే విభిన్నమైన సినిమా. అలాగే తమిళ్ లో లావణ్య త్రిపాఠి తో కలసి మరో సినిమా చేస్తున్నాను. కృష్ణవంశీ గారితో చేస్తున్న నక్షత్రం పూర్తయిన తర్వాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com