చైతు స్థానంలో సందీప్ కిషన్...
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా నగరం(తమిళంలో మా నగరం) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా మారుతున్నాడు. సందీప్ కిషన్, కృష్ణవంశీ నక్షత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది కాకుండా మంజుల దర్శకత్వంలో త్రిదాచౌదరి, అమైరా దస్తర్లతో ఓ లవ్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు కాకుండా బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాలు కాకుండా తెలుగు, తమిళంలో రూపొందనున్న ఓ చిత్రంలో నటించడానికి రీసెంట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సందీప్. `16 ఎవ్విరి డిటెయిల్ కౌంట్స్` దర్శకుడు కార్తీక్ నరేన్ తన తదుపరి చిత్రంగా నాగాసురన్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ముందుగా హీరోగా నాగచైతన్యను అనుకున్నారు. చైతన్య కూడా ముందుగా సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించిన ముందు ఉన్న కమిట్ మెంట్స్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేనని తప్పుకున్నాడట చైతు. దీంతో దర్శకుడు కార్తీక్ నరేన్ సందీప్ కిషన్‌ను కలిసి కథ వినిపించగా, సందీప్ సినిమాలో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments