సందీప్ కిషన్ రిలీజ్ చేసిన తను..వచ్చేనంట మోషన్ పోస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా తేజ కాకుమాను (బాహుబలి ఫేం), రేష్మి గౌతం, ధన్య బాలకృష్ణన్ నటినటులుగా వెంకట్ కాచర్ల దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం “తను... వచ్చేనంట”. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను, మోషన్ పోస్టర్ ని ప్రముఖ హీరో సందీప్ కిషన్ చూసి మెచ్చుకున్నారు.
ఆయన మాట్లాడుతూ ''మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చూసాను. చాలా బాగుంది. రేష్మి చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని చూస్తేనే అర్ధం అవుతుంది'' అన్నారు.
ఈ చిత్ర రచయిత మరియు నిర్మాత అయిన చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ “మా చిత్రం ఒక్క పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా చిత్ర కథ ప్రధానంగా లవ్ స్టొరీతో పాటు హారర్, కామెడీ ప్రధానంగా జరుగుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లూక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ ని, ఆడియో కూడా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్, పాత్రలు ఆద్యంతం వినోదాన్ని పంచుతాయి. ది బెస్ట్ అవుట్ పుట్ కోసం దర్శకుడు వెంకట్ కాచర్ల బాగా కష్ట పడ్డారు. అరిస్ట్ ల సహకారం చాలాబావుంది. మా బ్యానర్ కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది” అని తెలిపారు.
దర్శకుడు వెంకట్ కాచర్ల మాట్లాడుతూ “తేజ, రేష్మి, ధన్య బాలకృష్ణ అద్భుతంగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రేష్మి పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా కథ , కథనం కొత్తగా వుంటాయి. ఈ సినిమాలో విజయ్ అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్ అందించారు.” అన్నారు. ఈ చిత్రానికి ఆన్ లైన్ ప్రొడ్యూసర్ : బెక్కం రవీందర్, ఆర్ట్ డైరెక్టర్ : సిస్తల శర్మ, ఛాయాగ్రహణం : రాజ్ కుమార్, ఎడిటింగ్ టీం : గ్యారీ B.H., గణేష్ .D, విజువల్ ఎఫెక్ట్స్ : విజయ్, సంగీతం : రవిచంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శశి ప్రీతం, సహ నిర్మాత : P. యశ్వంత్, కథ – నిర్మాత : చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రెడ్డి, స్క్రీన్ ప్లే – దర్సకత్వం : వెంకట్ కాచర్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments