ప్రొజెక్ట్ జెడ్.. ఓ వివాదం
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ కిషన్, లావణ్యత్రిపాఠి నాయకానాయికలుగా సి.వి.కుమార్ నిర్మించి, రూపొందించిన తమిళ చిత్రం 'మాయావన్'. తెలుగులో 'ప్రాజెక్ట్ జెడ్' పేరుతో అనువదించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో సక్సెస్ వైపుగా దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే...ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం) తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కావలసి ఉంది.
అయితే, కొన్ని కారణాల వలన, అందవలసిన అనుమతులు ఇంకా అందకపోవడంతో ఈ రోజు మార్నింగ్ షోలన్నింటిని రద్దు చేసారు. అయితే కొన్ని చోట్ల మాత్రం అక్రమంగా ఈ మూవీని ప్రదర్శించడం జరిగింది. దీనిపైన స్పందించిన హీరో సందీప్ కిషన్, "నా డబ్బింగ్ లేకుండా, నిర్మాతల నుండి అనుమతులు, క్లియరెన్స్ లేకుండా ఈ సినిమాని కొన్నిచోట్ల అక్రమంగా ప్రదర్శించారు. ఇది చట్టరీత్యా నేరం. దీనిపై మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం" అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. మరి, ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments