ప్రొజెక్ట్ జెడ్‌.. ఓ వివాదం

  • IndiaGlitz, [Friday,December 29 2017]

సందీప్ కిషన్, లావణ్యత్రిపాఠి నాయకానాయికలుగా సి.వి.కుమార్ నిర్మించి, రూపొందించిన త‌మిళ చిత్రం 'మాయావన్'. తెలుగులో 'ప్రాజెక్ట్ జెడ్' పేరుతో అనువదించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో సక్సెస్ వైపుగా దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే...ఈ సినిమా ఈ రోజు (శుక్ర‌వారం) తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కావలసి ఉంది.

అయితే, కొన్ని కారణాల వలన, అందవలసిన అనుమతులు ఇంకా అందకపోవడంతో ఈ రోజు మార్నింగ్ షోలన్నింటిని రద్దు చేసారు. అయితే కొన్ని చోట్ల మాత్రం అక్రమంగా ఈ మూవీని ప్రదర్శించడం జరిగింది. దీనిపైన స్పందించిన హీరో సందీప్ కిషన్, "నా డబ్బింగ్ లేకుండా, నిర్మాతల నుండి అనుమతులు, క్లియరెన్స్ లేకుండా ఈ సినిమాని కొన్నిచోట్ల అక్రమంగా ప్రదర్శించారు. ఇది చట్టరీత్యా నేరం. దీనిపై మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం" అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. మ‌రి, ఈ వివాదం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

More News

రవితేజ 'టచ్ చేసి చూడు' షూటింగ్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.

మరో ఛాన్స్ కొట్టేసిన సీరత్

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల బాట పట్టింది 'రన్ రాజా రన్ ' ఫేమ్ సీరత్ కపూర్.

రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ  సినిమా త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు చ‌ర‌ణ్‌. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

నాగ చైతన్య 'ధర్మాభాయ్'?

పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచారు అక్కినేని నాగ చైతన్య.

'హలో...' వంటి ఫీల్ గుడ్ మూవీ నా యాభైవ చిత్రం కావడం చాలా హ్యాపీగా వుంది - అనూప్ రూబెన్స్

'జై'చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయి అనతికాలంలోనే 50 చిత్రాలకు మ్యూజిక్ చేసిన అనూప్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు