సందీప్ కిషన్ నిత్యా మీనన్ 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం టాకీ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

'ప్ర‌స్థానం' వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన యంగ్ హీరో సందీప్‌కిష‌న్‌. 'రొటీన్ ల‌వ్‌స్టోరి', 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'బీరువా', 'టైగ‌ర్' వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌తో మంచి స‌క్సెస్‌లు సాధించారు. విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ కిషన్, నిత్యా మీనన్ ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఒక స్పెషల్ హైలైట్ అవుతుంది అని డైరెక్టర్ రాజ‌సింహ తాడినాడ భావిస్తున్నారు.

ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఒక మూడు పాటలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఇందులో ఒక పాటను మన దేశం లో, మరొక రెండు పాటలను విదేశాలలో చిత్రీకరిస్తామని మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి అన్నారు. అయన గతం లో 'సినిమా చూపిస్త‌మావ' చిత్రానికి నిర్మాత గా ఉన్నారు.

"ఇది ఒక డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. ఏప్రిల్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ' ఒక్క అమ్మాయి త‌ప్ప' చిత్రం నిర్మిస్తున్నాం. దీని కాప్షన్, All Indians are My Brothers and Sisters" అని ఆయన అన్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు రాజ‌సింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయన గతం లో ఎన్నో చిత్రాలకు రచయిత గా పని చేసారు.

హీరో సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో నేనొక తెలివైన కాలేజ్‌ కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. ఈ చిత్రం లో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తోంది. మా కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది '' అన్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇందులో ప్రఖ్యాత హిందీ నటుడు రవి కిషెన్ విలన్ గా కనపడతాడు. ఈ చిత్రం లో షుమారు ఒక గంట ముప్పై నిమిషాలు పాటు హై ఎండ్ గ్రాఫిక్స్ ఉంటాయి.

దర్శకుడు రాజసింహ తాడినాడ మాట్లాడుతూ దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. ఇందులో సుమారు ఒక గంట ముప్పై నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటుంది. కొత్త బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సందీప్‌ కొత్త‌గా క‌నిపిస్తాడు. రవి కిషెన్ నటన చాలా బాగుంది. చోటా కే నాయుడు గారు అద్భుతమైన కెమెరా వర్క్ తో చిత్రానికి మంచి లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చారు. '' అన్నారు.

నటీ నటులు - సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రావు రమేష్‌, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి,రేవతి తదితరులు. సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాత : మాధవి వాసిపల్లి, నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ

More News

Allu Sirish confuses on social media

When Allu Arjun made Race Gurram, nobody speculated that he had had plans to participate in horse racing games in real life.

Aamir Khan attends dinner hosted by PM Narendra Modi

'PK' star Aamir Khan was the guest of honour at a dinner hosted by Prime Minister Narendra Modi. The grand dinner was organised after Modi where it launched the mega Make in India (MII) week here earlier yesterday. Stunning actress Kangana Ranaut was also invited at the private dinner held in Turf Club where top politicians, diplomats from several countries were in present.

Amitabh, Jaya, Dharmendra, Ramesh Sippy come together to launch Hema Malini's new album

It was yesterday that, the audience were happy to see 'Sholay' movie stars to share the stage together. Iconic star Amitabh Bachchan, Dharmendra, Jaya Bachchan and filmmaker Ramesh Sippy had come together to launch Hema Malini's new album titled- ‘Dream Girl’. When Hema was asked about her feelings towards it, she said: "I was excited to sing those two Bengali songs, which I had recorded for Kisho

Riteish Deshmukh unveils his look from 'Banjo'

'Grand Masti' star Riteish Deshmukh is currently shooting for his upcoming movie 'Banjo'. Seems like, he is trying to do different role in his career from comedy to villain and now as a musician.

Ram Charan's film's working title

Surendar Reddy has come out with a tentative title for his remake film with Ram Charan. It's Dhruva. Rakshak was the earlier working title.