నక్షత్రం సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం నక్షత్రం. ఈ చిత్రంలో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ గా గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీ చక్ర మీడియా బ్యానర్ పై కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్ సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల నక్షత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు సెకండ్ లుక్ రిలీజ్ చేసి నక్షత్రం టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సెకండ్ లుక్ లో హీరో సందీప్ కిషన్ మెడలో చెయిన్...ఆ చెయిన్ కి నక్షత్రం వేలాడుతుంది. డిఫరెంట్ గా ఉన్న సెకండ్ లుక్ గురించి సందీప్ కిషన్ స్పందిస్తూ...ఈ చిత్రంలో నా క్యారెక్టర్ రియలిస్టిక్ గా కృష్ణవంశీ గారి స్టైల్ లో ఉంటుంది అని తెలియచేసారు. నక్షత్రం సినిమా సక్సెస్ పై హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ కృష్ణవంశీ చాలా నమ్మకంగా ఉన్నారు. మరి...వారి నమ్మకానికి తగ్గట్టే నక్షత్రం విజయం అందిస్తుందేమో చూద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com