close
Choose your channels

ఇక నుంచి నేను ఏ సినిమా చేసినా అదిరిపోయింది అనే మాట వస్తుంది ఇది గ్యారెంటీ - హీరో సందీప్ కిషన్

Saturday, May 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్నేహ‌గీతం, ప్ర‌స్ధానం, వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, గుండెల్లో గోదారి, బీరువా, టైగ‌ర్, ర‌న్...ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్. తాజాగా సందీప్ కిష‌న్ ఒక్క అమ్మాయి త‌ప్ప అనే చిత్రంలో న‌టిస్తున్నారు. సందీప్ కిష‌న్, నిత్యామీన‌న్ జంట‌గా న‌టిస్తున్న ఒక్క అమ్మాయి త‌ప్ప ఆడియోను ఈ నెల 8న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 7న యువ హీరో సందీప్ కిష‌న్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా హీరో సందీప్ కిష‌న్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...
గ‌త సంవ‌త్స‌రం పుట్టిన‌రోజుకి - ఈ సంవ‌త్స‌రం పుట్టిన‌రోజుకి తేడా ఏమిటి..?
తేడా ఏమీ లేదండీ..ఒక సంవ‌త్స‌రం వ‌య‌సు పెరిగింది అంతే...(న‌వ్వుతూ..) కాక‌పోతే సినిమాల గురించి...జీవితం గురించి కొన్ని విష‌యాలు నేర్చుకున్నాను.
ఒక్క అమ్మాయి త‌ప్ప‌...ప్రొగ్రెస్ ఏమిటి..?
ఫ‌స్ట్ కాపీ రెడీ అయిపోయింది. మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలి. నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన చిత్రాల్లో బెస్ట్ ఫిల్మ్ ఇది. ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.
ఒక్క అమ్మాయి త‌ప్ప చిత్రంలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?
చ‌దువు ఇష్టం లేక మ‌ధ్య‌లోనే కాలేజీ మానేసిన యువ‌కుడు క‌థ ఇది. చ‌దువు మానేసాడ‌ని..తెలివితేట‌లు లేవ‌నుకుంటే పొర‌పాటే. చ‌ద‌వాల్సింది కాలేజీలో కాదు...జీవితాన్ని అనుకుంటాడు. అందుక‌నే ఎవ‌ర్నైనా చూస్తే...అత‌ను ఎలాంటి వాడో ఇట్టే చెప్పేస్తుంటాడు. ఈ విధంగా ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ ఉంటుంది.
ఒక్క అమ్మాయి త‌ప్ప క‌థ ఏమిటి..?
ఇది ఒక డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరి. హైటెక్ సిటీ ఫ్లై ఓవ‌ర్ మ‌ధ్య ట్రాఫిక్ జామ్ లో జ‌రిగే క‌థ ఇది. ఇద్ద‌రు ప్రేమికులు ఆ ట్రాఫిక్ దాటుకుని వాళ్ల స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌టప‌డ్డార‌నేదే ఈ క‌థ. ఈ సినిమా 60% ట్రాఫిక్ జామ్ లోనే జ‌రుగుతుంది. స్ర్కీన్ ప్లే చాలా డిప‌రెంట్ గా ఉంటుంది. ఆడియోన్స్ కి ఒక కొత్త సినిమాని చూసిన అనుభూతి క‌లిగిస్తుంది.
60% ట్రాఫిక్ జామ్ లో షూటింగ్ అంటే ఇబ్బంది క‌దా..ఎలా షూట్ చేసారు..?
నిజ‌మే... 60% ట్రాఫిక్ జామ్ లో షూటింగ్ చేయాలంటే ఇబ్బందే. అందుక‌నే ఏడురోజులు ఓరిజిన‌ల్ గా హైద‌రాబాద్ హైటెక్ సిటీ లో షూటింగ్ చేసాం. మిగిలిన ట్రాఫిక్ జామ్ సీన్స్ అన్నీ అన్న‌పూర్ణ స్టూడియోలో సెట్ వేసి న‌ల‌భై రోజులు పాటు సి.జి వ‌ర్క్ చేసాం.
ఒక్క అమ్మాయి త‌ప్ప టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి..?
చిన్న‌ప్పుడు స్కూల్ లో భార‌త‌దేశం నా మాతృభూమి...అంటూ ప్ర‌తిజ్ఞ చేసేవాళ్లం క‌దా. అలా హీరో త‌ను ప్రేమించే అమ్మాయి త‌ప్ప మిగిలిన వారంద‌రూ త‌న సిస్ట‌ర్స్ అనుకుంటుంటాడు. అందుక‌నే ఒక్క అమ్మాయి త‌ప్ప అనే టైటిల్ పెట్టాం.
మీరేమో పొడుగు...నిత్యామీన‌న్ పొట్టి..షూటింగ్ చేసేట‌ప్పుడు ఇబ్బంది అనిపించ‌లేదా..?
అమితాబ్ బ‌చ్చ‌న్ - జ‌య బ‌చ్చ‌న్ కూడా అంతే కదే...(న‌వ్వుతూ..) షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు నేను పొడుగు - నువ్వు పొట్టి అని స‌ర‌దాగా అనుకునే వాళ్లం త‌ప్పా...షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌లేదు.
నిత్యామీన‌న్ తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ గురించి..?
నిత్యామీన‌న్ కి ఈ క‌థ చాలా బాగా న‌చ్చింది. ఎంత బాగా న‌చ్చింది అంటే...క‌థ విన్న త‌ర్వాత త‌న సీన్స్ కొన్నింటిని తీసేయ‌మంది. డైరెక్ట‌ర్ రాజ‌సింహ తో ఈ సీన్స గురించి డిష్క‌స్ చేసి...ఈ సీన్స్ నాకోసం రాసారా..? నా సీన్స్ త‌క్కువ ఉన్నా ఫ‌ర‌వాలేదు. క‌థ ముఖ్యం అంటూ త‌న సీన్స్ నే త‌గ్గించ‌మంది. అంత‌లా నిత్యామీనన్ కి ఈ క‌థ న‌చ్చింది. నిత్యా ఎలా న‌టిస్తుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ చిత్రంలో కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టు చాలా బాగా న‌టించింది.
రైట‌ర్ రాజ‌సింహకి డైరెక్ట‌ర్ గా ఈ మూవీ ఫ‌స్ట్ ఫిల్మ్ క‌దా..ఈ క‌థ‌ను ఆయ‌న తెర‌కెక్కిస్తున్నవిధానం గురించి..?
2012లో రాజ‌సింహ ఈ క‌థ చెప్పారు. నాకు బాగా న‌చ్చింది. ఈ సినిమా ఎప్పుడో చేయాలి... కాక‌పోతే కాస్త లేట్ అయ్యింది. ఈ క‌థ చాలా మంది ద‌గ్గ‌ర‌కి వెళ్లింది. క‌థ విన్న ప్ర‌తి ఒక్క‌రు చాలా బాగుంది అన్నారు. కానీ...ఎందుక‌నే చేయ‌డానికి ముందుకు రాలేదు. చివ‌ర‌కి ఈ క‌థ‌ మ‌ళ్లీ నా ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింది. ఈ క‌థ పై న‌మ్మ‌కం ఏర్ప‌డ్డానికి మూడు సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. మా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు రాజ‌సింహ అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా చాలా బాగా తెర‌కెక్కిస్తున్నారు. ఏడు సంవ‌త్స‌రాల నుంచి ఈ క‌థ‌తో రాజ‌సింహ ట్రావెల్ చేస్తున్నారు. మంచి టీమ్ తో ఈ సినిమా చేస్తున్నాను. మంచి విజ‌యాన్ని సాధిస్తామ‌నే న‌మ్మ‌కం ఉంది.
ఒక్క అమ్మాయి త‌ప్ప మీ కెరీర్ లో ఎలాంటి చిత్రంగా నిలుస్తుంది అనుకుంటున్నారు..?
నా కెరీర్లో హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన చిత్రాల్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంది.
ఆరు సంవ‌త్స‌రాల కెరీర్లో సందీప్ లో వ‌చ్చిన మార్పు ఏమిటి..?
ఈ ఆరు సంవ‌త్స‌రాల్లో చాలా నేర్చుకున్నాను. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో...ఆలోచించ‌కుండా ఏది ప‌డితే అది మాట్లాడేవాడిని. ఇప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నాను. అలాగే బాగా తెలుసుకున్న విష‌యం ఏమిటంటే...ప్ర‌తి మ‌నిషి డిఫ‌రెంట్. అంద‌రూ మ‌న‌కు న‌చ్చిన‌ట్టు ఉంటార‌నో..ఉండాల‌నో అనుకోకూడ‌దు.. కోరుకోకూడ‌దు. అందుచేత మ‌న ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్న వాళ్ల‌తో ట్రావెల్ చేయాల్సి వ‌స్తే... ఎడ్జెస్ట్ అవ్వాల‌ని తెలుసుకున్నాను.
యువ హీరోల మ‌ధ్య పోటీ ఉన్న‌ప్ప‌టికీ...పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు..? ఎలా ఫీల‌వుతున్నారు..?
నాకు న‌చ్చిన సినిమా చేయాలి. ఆ సినిమా జ‌నానికి న‌చ్చాలి. ఇక పోటీ అంటారా...ఒక‌రు డ్యాన్స్ బాగా చేస్తారు. మ‌రొక‌రు ఫైట్స్ బాగా చేస్తారు. ఇంకొక‌రు ఫ‌ర్ ఫార్మెన్స్ పెంటాస్టిక్ గా చేస్తారు. నా బ‌లం ఏమిటో క‌నుక్కోని దానితో ఆడియోన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయాలి. మేమంతా సినిమాలు చేసేది ఎంట‌ర్ టైన్ చేయ‌డం కోస‌మే క‌దా. 52 వారాలు ఉన్నాయి. ఈ 52 వారాల్లో ఒక్క వారం క‌రెక్ట్ గా కుదిరినా చాలు క‌దా. న‌చ్చిన సినిమా చేసుకుంటూ వెళుతున్నాను. నాకు న‌చ్చిన సినిమాలు నేను చేయ‌లేని ప‌రిస్థితి రాకూడ‌దు దీని గురించే ఆలోచిస్తాను త‌ప్పా...నాకు పోటీ ఎవ‌రు...? వాళ్ల‌కు పోటీగా నేను ఏం చేయాలి అని ఆలోచించ‌ను.
బ‌డ్జెట్ విష‌యానికి వ‌చ్చేస‌రికి...కొన్ని ప‌రిమితులు ఉంటాయి క‌దా..మ‌రి....మీ సినిమాకి బ‌డ్జెట్ విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉంటాయి..?
మంచో చెడో తెలియ‌దు కానీ...నేను ఎంచుకునే క‌థ‌లు బ‌డ్జెట్ ప‌రంగా కాస్త ఎక్కువుగానే ఉన్నాయి. ఒక్క‌ అమ్మాయి త‌ప్ప‌ నా కెరీర్ లో బిగ్ బ‌డ్జెట్ ఫిల్మ్ అని చెప్ప‌చ్చు. ఒక్క అమ్మాయి త‌ప్ప సినిమాకి కృష్ణ‌వంశీ గారి న‌క్ష‌త్రం సినిమాకి బ‌డ్జెట్ విష‌యంలో చాలా తేడా ఉంది. ఒక క‌థ నాకు కావాలి అనుకుంటే...ఆ క‌థ‌కు త‌గ్గ‌ట్టు బ‌డ్జెట్ ఉండాలి. దానిని మ‌నం ఏం చేయ‌లేం. కొన్ని క‌థ‌లు నా బ‌డ్జెట్ కి సెట్ కాక చేయ‌లేక పోయాను. అందుచేత క‌థ‌ను బ‌ట్టే బ‌డ్జెట్ ఉంటుంది.
సినిమా బాగా క‌లెక్ట్ చేస్తే..నెక్ట్స్ మూవీకి రెమ్యూన‌రేష‌న్ పెంచుతున్నారు..మీ అభిప్రాయం ఏమిటి..?
నా సినిమా 10 కోట్లు క‌లెక్ట్ చేస్తే నెక్ట్స్ మూవీకి నిర్మాత 6 కోట్లే పెడ‌తారు. హిట్ వ‌స్తే 7 కోట్లు పెట్ట‌మ‌ని అడ‌గొచ్చు. ఒక‌వేళ సినిమా పోయింది అనుకోండి 5 కోట్లే బ‌డ్జెట్ అంటారు. 5 కి7 కి మ‌ధ్య ఉండ‌డం త‌ప్ప పెద్ద తేడా ఏమీ ఉండ‌దు. మంచి క‌థ‌లు చూసుకుని ఎంచుకోవాలి అంతే. ఇక రెమ్యూన‌రేష‌న్ పెంచ‌డం అంటారా...వేరే వాళ్ల సంగ‌తి నాకు తెలియ‌దు కానీ...నేనైతే సినిమా హిట్ అయ్యింద‌ని రెమ్యూన‌రేష‌న్ పెంచ‌డం లేదు.
మీ బ‌లం మావ‌య్య ఛోటా కె నాయుడేనా..?
అవునండి నా బ‌లం ఛోటా మామే. ఎందుకు అలా అంటున్నానంటే...నాకు న‌చ్చిన క‌థ‌ను నా బ‌డ్జెట్ తో తీయ‌గ‌లిగేది మావ‌య్యే ఒక్క‌రే. నాకు న‌చ్చిన క‌థ‌ని నా బ‌డ్జెట్ లో అదీ కూడా మంచి క్వాలిటీతో ఛోటా మామ త‌ప్ప‌ఇంకెవ‌రు తీయ‌లేరు. అమ్మ- నాన్నకి ఇండ‌స్ట్రీతో సంబంధం లేదు. ఒక నాన్న స్ధానంలో ఉండి నా బాధ్య‌త‌ను త‌న భుజాల‌పై వేసుకున్నారు. నా బ‌లం ఛోటా మామే. నా సినిమా అయినా.. వేరే వాళ్ల సినిమా అయినా.. ఒకేలా క‌ష్ట‌ప‌డ‌తారు. అంత‌లా క‌ష్ట‌ప‌డే వ్య‌క్తి నా మావ‌య్య కావ‌డం నా అదృష్టం.
కృష్ణ‌వంశీ గారితో వ‌ర్క్ చేసిన త‌ర్వాత ఏ ఏక్ట‌ర్ కైనా ఏక్టింగ్ లో చాలా మార్పు వ‌స్తుంది..మీరేమంటారు..?
కృష్ణ‌వంశీ గారు చాలా కొత్త విష‌యాలు చెబుతుంటారు. ఆయ‌న నుంచి చాలా నేర్చుకుంటున్నాను. నేను కొన్ని కొన్ని సీన్స్ లో డైలాగ్స్ గ‌ట్టిగా చెప్ప‌ను. ఎందుకంటే ఎవ‌రైనా ఓవ‌ర్ యాక్ష‌న్ అనుకుంటారేమో అని. ఇది ఎవ‌రికీ చెప్ప‌లేదు. కానీ కృష్ణ‌వంశీ గారు క‌నిపెట్టేసారు. ఎందుకు అలా చేస్తున్నావ్..మ‌రి ఓవ‌ర్ అవుతుంది అనుకుంటే మ‌రోలా చేయి అని స‌ల‌హా ఇచ్చారు. ఖ‌చ్చితంగా కృష్ణ‌వంశీ గారి సినిమాలో నా ఏక్టింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. సో...నిజంగానే కృష్ణ‌వంశీ గారితో వ‌ర్క్ చేసిన త‌ర్వాత ఏక్టింగ్ లో మార్పు వ‌స్తుంది. నాకు ఆయ‌న సినిమాల్లో ఏ జోన‌ర్ అయితే ఇష్ట‌మో..ఆయ‌న‌తో అలాంటి జోన‌ర్ లోనే సినిమా చేసే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. పోలీస్ అవ్వాల‌నుకునే యువ‌కుడు క‌థ ఇది. ఒక్క అమ్మాయి త‌ప్ప‌, న‌క్ష‌త్రం ఈ రెండు చిత్రాలు నా కెరీర్లో ట‌ర్నింగ్ పాయింట్స్ గా నిలుస్తాయి.
రెండు త‌మిళ చిత్రాలు ఒకేసారి చేయ‌డానికి కార‌ణం ఏమిటి..?
నేను కావాల‌ని ప్లాన్ చేసింది కాదండి. త‌మిళ్ లో నాకు వ‌రుస‌గా రెండు చిత్రాలు చేసే అవ‌కాశం వ‌చ్చింది చేస్తున్నాను. అంతే..కానీ త‌మిళ్ లో క‌థ విని ప్రొడ్యూస‌ర్ ని సెట్ చేసుకుని చేసింది కాదు. నా కెరీర్ తెలుగు సినిమా. అంతే కానీ ఏదో త‌మిళ్ లో పెద్ద హీరో అయిపోదాం అనుకుని ప్లాన్ చేసి చేయ‌డం లేదు. అయితే త‌మిళ్ లో చేస్తున్న రెండు చిత్రాలు మంచి పేరు తీసుకువ‌స్తాయి అనే న‌మ్మ‌కం ఉంది. త‌మిళ్ లో చేస్తున్న ఫ‌స్ట్ ఫిల్మ్ మా న‌గ‌ర‌మ్ ఇది చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. రెండో చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుంది. త‌మిళ్ లో నేను చేస్తున్న రెండు సినిమాలు స్టూడియోన్ గ్రీన్ సంస్థ నిర్మిస్తుంది.
ఏదైనా సినిమా చేసేట‌ప్పుడు మీ ఇన్ వాల్వ్ మెంట్ ఎంత వ‌ర‌కు ఉంటుంది..?
క‌థ విని ఒకే చేసిన త‌ర్వాత డైరెక్ట‌ర్ ఏం చెబితే అది చేస్తున్నాను. షూటింగ్ కి వెళ్ల‌డం నేను ఏం చేయాలి..? ఏ ఎమోష‌న్లో చేయాలి..? అని అడుగుతాను చేస్తాను అంతే. ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకుంటే బాగుంటుంది. నా ప‌ని న‌టించ‌డం. సో...న‌టిస్తాను అంతే కానీ ప‌క్క వాళ్ల ప‌ని గురించి స‌ల‌హాలు ఇవ్వ‌ను. కొన్నిసార్లు మ‌న క‌ళ్ల ముందు త‌ప్ప జ‌రుగుతుంటే చూస్తు ఊరుకోకుండా ఏదో చెప్పేవాడిని. అయితే.... నేను చెప్ప‌డం వ‌ల‌న అది బాగుప‌డ‌దు. చెప్ప‌కుండా ఉన్నందున చెడిపోదు అని తెలుసుకున్నాను.
క‌థ వినే హీరో ఓకే చేస్తారు..కానీ ఫెయిల్ అవుతుంటాయి. అందుచేత సినిమా ఫ్లాప్ అవ్వ‌డానికి హీరో కూడా ఒక కార‌ణం అనుకోవ‌చ్చా..?
ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే...ఆ క‌థ‌ను ఎంచుకోవ‌డం నా త‌ప్పు. ఆ క‌థ‌కి డైరెక్ట‌ర్ న్యాయం చేసాడు. అందుచేత ఫ్లాప్ అయ్యిందంటే నాదే త‌ప్పు అనుకుంటాను.
మీరు స‌క్సెస్ అవుతాయి అనుకున్న సినిమాలు ఫ్లాప్ అయిన‌వి ఏమిటి..?
జోరు, ర‌న్
మీకు చాలా మంది హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్న‌ట్టున్నారు..? ఎప్పుడూ ఏదో హీరోయిన్ తో మీకు ఎఫైర్ ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తుంటాయి..?
నిజ‌మే..నాకు చాలా మంది హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుక‌ని అంటే... నాతో వ‌ర్క్ చేసిన వాళ్లంద‌రు నాకు మంచి ఫ్రెండ్స్. సాయిధ‌ర‌మ్ తేజ్, ర‌కుల్, రెజీనా...వీళ్లు నాకు ఏక్ట‌ర్స్ గా క‌న్నా ఎక్కువుగా బెస్ట్ ఫ్రెండ్స్. సినిమాల‌కు వెళ్లినా స‌ర‌దాగా ఎక్క‌డ‌కి వెళ్లినా వీళ్ల‌తోటే వెళుతుంటాను. నేను ఏమిటో నాకు తెలుసు. అందుచేత నా గురించి ఎవ‌రు ఏర‌కంగా రాసినా ప‌ట్టించుకోను.
ఇంత‌కీ..పెళ్లి ఎప్పుడు..?
ప్ర‌స్తుతం ఆలోచ‌న అంతా కెరీర్ పైనే. పెళ్లి గురించి ప్ర‌స్తుతానికి ఎలాంటి ఆలోచ‌న లేదు.
ప్ర‌స్ధానం లో నెగిటివ్ రోల్ చేసారు క‌దా...మ‌ళ్లీ అటువంటి అవ‌కాశం వ‌స్తే నెగిటివ్ రోల్స్ చేస్తారా..?
నాకు క్యారెక్ట‌ర్ న‌చ్చితే నెగిటివ్ రోల్ అయినా ఫ‌ర‌వాలేదు చేస్తాను.
స‌క్సెస్ ఫెయిల్యూర్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి..?
నేను ఇప్ప‌టి వ‌ర‌కు 18 చిత్రాలు చేసాను. ఇందులో గుడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. బ్యాడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. ప్రౌడ్ గా ఫీల‌య్యే సినిమాలు చేసాను. ప్ర‌తి సినిమా స‌క్సెస్ అవ్వాల‌నే చేస్తాం. కానీ..ఒక్కొక్క‌సారి ఎక్క‌డో ఏదో మిస్ అవ్వ‌డం వ‌ల‌న ఫెయిల్ అవుతుంటాయి. స‌క్సెస్ అనేది మ‌న చేతుల్లో ఉండ‌దు. అందుచేత మ‌న ప‌నిని స‌క్ర‌మంగా చేయాలి. ఫ‌లితం గురించి ప‌ట్టించుకోకూడ‌దు అనేది నా అభిప్రాయం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు త‌మిళ్ లో రెండు చిత్రాలు చేస్తున్నాను. అలాగే కృష్ణ‌వంశీ గారితో నక్ష‌త్రం చేస్తున్నాను. న‌క్ష‌త్రం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను. అయితే ఒక‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను ఇక నుంచి నేను ఏ సినిమా చేసినా అదిరిపోయింది అనే మాట వ‌స్తుంది ఇది గ్యారెంటీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment