అందర్నీ ఆకట్టుకునేలా ఉండే సింపుల్ ఫన్ ఫిల్మ్ రన్ - హీరో సందీప్ కిషన్
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ కిషన్ - అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్. ఎ టి.వీ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ చిత్రం నేరమ్ సినిమాకి రీమేక్ గా రూపొందిన రన్ చిత్రం రేపు రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
రన్ కాన్సెప్ట్ ఏమిటి..?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సంజు. అమ్ము పాత్రలో అనీషా, వడ్డీ రాజా పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా నటించారు. ఈ సినిమా అంతా టైమ్ పై రన్ అవుతుంటుంది. ఈ క్యారెక్టర్స్ లైఫ్ టైమ్ వల్ల ఎలాంటి మలుపులు తిరిగాయనేదే రన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే...టైమ్ బాగుంటే ప్రపంచానికి మనం పరిచయం అవుతాం. టైమ్ బాగోలేకపోతే ప్రపంచం మనకి పరిచయం అవుతుంది. ఈ విథంగా ఈ సినిమా ఉంటుంది.
హీరోయిన్ అనీషా గురించి..?
అనీషా మంచి అమ్మాయి. తెలుగమ్మాయి. సీన్ చేసే ముందు రిహార్సల్స్ చేసి మరీ నటించేది. అమ్ము పాత్రలో పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటించింది. ఈ సినిమా అనీషాకి మంచి పేరు తీసుకువస్తుంది.
భారీ చిత్రాలను నిర్మించిన నిర్మాత అనిల్ సుంకర్ తో సినిమా చేయడం ఎలా ఉంది..?
నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల్లో ఒకరు అనిల్ సుంకర్ గారు. ఆయన గొప్ప వ్యక్తి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఫోన్ చేసి ఈ సినిమా మనం చేద్దాం అన్నప్పుడు సెకండ్ థాట్ లేకుండా వెంటనే ఒకే చెప్పేసాను. ఎక్కడా రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
డైరెక్టర్ అని వర్కింగ్ స్టైల్ గురించి..?
డైరెక్టర్ అని కి టెక్నీకల్ గా మంచి పట్టు ఉంది. ప్రస్ధానం తర్వాత నన్ను నమ్మి నాతో సినిమా చేయాలనుకున్నాడు. అప్పుడు ఇద్దరం సినిమా చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పుడు కుదరింది ఇద్దరం మంచి సినిమా చేసాం. చాలా టైట్ స్క్రీన్ ప్లే తో అందర్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని అని తెరకెక్కించారు
మీ కెరీర్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు..?
ఇప్పుడు కాస్త స్పీడు పెరిగింది. తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తున్నాను. రారా కృష్ణయ్య, జోరు సినిమాలు ప్లాప్ తర్వాత కాస్త ఫీలయ్యాను. బీరువా సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమా కూడా పోయింది అనుకుంటుంటే..అనుకోని విధంగా కొన్నిఏరియాల్లో యాభై రోజులు కూడా ఆడింది. బీరువా అంతలా ఆడుతుందని అసలు ఊహించలేదు. బీరువా - టైగర్ నన్ను కాపాడాయనే చెప్పాలి. సినిమా ప్లాప్ అయితే ప్లాప్ అయ్యిందే అనే బాధ కన్నా ఆరు నెలలు కష్టపడి సినిమా చేసాం జనం చూడలేకపోయారే అనే బాధే ఉంటుంది.
రన్ మీ ఫస్ట్ రీమేక్ కదా...ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
నేరమ్ సినిమాని తమిళ్ లో చూసాను. చూసిన వెంటనే సినిమా బాగా నచ్చేసింది. మన నేటివిటీకి తగ్గట్టు ఇందులో కొన్ని మార్పులు చేసాం. రీమేక్ ఎక్స్ పీరియన్స్ అంటే...ఈ సినిమా హిట్ అందుచేత హిట్ మూవీ చేస్తున్నాం అనే హోప్ తో ఈ సినిమాని చేసాను. త్రి స్టేట్స్ లో రిలీజై సక్సెస్ అయ్యింది. ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది అని నమ్మకం.
ఇక నుంచి మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు..?
ప్రస్తుతం నేను రెండు చిత్రాల్లో నటిస్తున్నాను. ఆ రెండు సినిమాలు రిలీజ్ తర్వాత...వాటి రిజెల్ట్ ను బట్టి నెక్ట్స్ ఎటువంటి సినిమాలు చేయాలి అని నిర్ణయం తీసుకుంటాను. ఏదో సినిమా చేసేయాలి అనే ఆలోచన లేదు. ఆరు నెలలు అయినా వెయిట్ చేసి మంచి సినిమా చేస్తాను.
రన్ ఆడియో ఫంక్షన్ లో చెప్పారు కదా...నాలో మార్పు వచ్చిందని..ఏమిటా మార్పు..?
ఇప్పటి వరకు కేవలం కథలను మాత్రమే నమ్మేవాడిని. ఇక నుంచి కథలతో పాటు డైరెక్టర్ ని కూడా నమ్ముతున్నాను. డైరెక్టర్ - కథ ను నమ్మి ఓకే అన్న తర్వాత షూటింగ్ లో అవుట్ ఫుట్ ఎలా వచ్చిందో చూడడం లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రమే అవుట్ ఫుట్ చూస్తున్నాను. ఇక నుంచి ఇదే కంటిన్యూ చేస్తాను. కావాలని నేను నేనుగా తీసుకున్న నిర్ణయం ఇది.
మీ అన్ని సినిమాల్లో మీ క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది..కారణం ఏమిటి..?
ఇప్పటి వరకు అలా ఉండి ఉండచ్చేమో కానీ...ఒక అమ్మాయి సినిమా నుంచి నా క్యారెక్టర్ - బాడీ లాంగ్వేజ్ అన్నింటిలో చాలా మార్పు ఉంటుంది. నా నెక్ట్స్ నాలుగు సినిమాలు ఒకదానికికొకటి సంబంధం ఉండదు.
తమిళ్ లో మీరు చేస్తున్న సినిమాలు ఎలా ఉంటాయి..?
మానగరమ్ అనే సినిమా చేస్తున్నాను. ఇది వేదం లాంటి సినిమా. ఇలాంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది. అలాగే మాయవన్ అనే మరో తమిళ సినిమా చేస్తున్నాను. ఇది కూడా డిఫరెంట్ స్టోరీతో ఉంటుంది.
ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది..నిజమేనా..?
ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనైతే ఉంది. కానీ...ఇప్పుడు కాదు. ఇంకా చాలా టైమ్ ఉంది.
రన్ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు..?
ఇదో కొత్త సినిమా. మంచి సినిమా. సింపుల్ గా ఉండే ఫన్ ఫిల్మ్ రన్. ఈ సినిమా ఓ మంచి సినిమా చేసామనే తృప్తి కలిగించింది . అన్నివర్గాల ప్రేక్షకులకు రన్ మూవీ నచ్చుతుంది అని నా నమ్మకం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments