కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో సందీప్ కిషన్

  • IndiaGlitz, [Wednesday,December 04 2019]

కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం 'నిను వీడని నీడను నేనే'. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఆ చిత్రం, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. అలాగే, 'తెనాలి రామకృష్ణ'తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు సందీప్ కిషన్. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును ఆయన బహుమతిగా ఇచ్చారు.

సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో 'వివాహ భోజనంబు' పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆయన, కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారు.

స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే... హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్' చేస్తున్న సంగతి తెలిసిందే.

More News

దిశ రేప్ వీడియోల కోసం లక్షల మంది గూగుల్‌లో వెతికారు!

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'మామాంగం' ట్రైల‌ర్‌, సాంగ్ లాంచ్‌

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం'

ఆడపడుచుల కోసం ‘నంబర్-1 కోడలు’ను తెస్తున్న జీ తెలుగు!

జీ తెలుగు తన సీరియల్స్‌లో మహిళల్ని ఎంత ఉన్నతంగా, బలంగా చూపిస్తోందనే విషయం.. ఛానెల్‌లో ప్రసారమౌతున్న ‘సూర్యకాంతం’,

బ్యాంక్ డిపాజిట్ దారులకు షాకింగ్ న్యూస్!

బ్యాంకు డిపాజిట్ దారులకు ఈ వార్త నిజంగానే షాకింగ్ అని చెప్పుకోవచ్చు.

మ‌రో బ‌యోపిక్‌.. క‌న్‌ఫ‌ర్మ్ చేసిన తాప్సీ

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సి శాండ్‌కీ అంఖ్ సినిమా కోసం షూట‌ర్‌గా మారారు. అది కూడా వ‌య‌సు మ‌ళ్లిన షూట‌ర్‌గా.