హీరో సందీప్ కోసం కేక్ ఫేషియల్ తయారు చేసిన హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్ధానం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రోటీన్ లవ్ స్టోరి, బీరువా, టైగర్..తదితర చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఈరోజు సందీప్ కిషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సందీప్ కోసం హీరోయిన్ రెజీనా కేక్ ఫేషియల్ తయారు చేసింది. కేక్ ఫేషియల్ తయారు చేయడం ఏమిటి అనుకుంటున్నారా..?
ఏమీ లేదండీ...ఈరోజు సందీప్ పుట్టినరోజు సందర్భంగా రెజీనా..బర్త్ డే విషెష్ తెలియచేసి సందీప్ ఫేస్ కి కేక్ రాసేసింది. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ట్విట్టర్ లో రెజీనా...కేక్ ఫేషియల్ అంటూ సరదాగా సందీప్ కి కేక్ పూసిన ఫోటో పోస్ట్ చేసింది అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments