సందీప్ కిషన్ హీరోగా ద్విభాషా చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఇటీవల టైగర్ చిత్రంతో అలరించిన సందీప్ కిషన్ హీరోగా తెలుగు, తమిళ్ లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని పిజ్జా, విల్లా ఫేం సి.వి.రావు తెరకెక్కించనున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ, సి.వి.రావు కలసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ అనంత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రానికి లియో జాన్ పాల్ ఎడిటర్. సందీప్ కిషన్ సరసన నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటించనున్నారు. అక్టోబర్ 5 నుంచి షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. విభిన్న కథలతో సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ ఈ ద్విభాషా చిత్రంతో విజయం సాధిస్తాడని ఆశిద్దాం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com