సందీప్ తలకు గాయం...?
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్‌కిషన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. తొలిరోజునే యాక్షన్ పార్ట్‌ను స్టార్ట్ చేశారు. మణికొండ లొకేషన్లో షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఓ సన్నివేశంలో నటిస్తుండగా సందీప్ కిషన్ తలకు పెద్ద గాయమైందట. వెంటనే సందీప్‌కిషన్‌ను హాస్పిటల్‌కు తరలించారు. సందీప్‌కిషన్‌కు చికిత్స అందించిన వైద్యులు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారట. దిల్‌రాజు నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే చిత్రయూనిట్ స్పందించాల్సిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సుదీప్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments