ఎండ X వాన: గత 121 ఏళ్ల చరిత్రలో.. మే నెలలో ఊహించని రికార్డులు

  • IndiaGlitz, [Friday,June 11 2021]

ప్రస్తుతం కోవిడ్ ప్రభావాన్ని పక్కన పెట్టి మాట్లాడుకుంటే.. వేసవి వస్తుందంటే చిన్న పిల్లలకు తెలియని ఆనందం, ఉత్సాహం ఉంటాయి. వేసవి సెలవులు వస్తాయి కాబట్టి. వృద్దులకు ఇబ్బందిగా ఉంటుంది. వేసవిలో భానుడి ప్రతాపానికి తాము తట్టుకోగలమా అని భయపడుతుంటారు. రైతులతే వేసవిలో వర్షం కోసం ఎదురు చూస్తుంటారు.

భానుడు తన ప్రతాపం మొత్తాన్ని మే నెలలో ప్రదర్శిస్తాడు. ప్రతి ఏటా మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం చూస్తూనే ఉన్నాం. వాన జాడ అయితే కనిపించడం కష్టం. కానీ ఈ ఏడాది గత మే నెలలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఆశ్చర్యకరమైన రికార్డులు నమోదయ్యాయి.

గత 121 ఏళ్ల చరిత్రలో రికార్డు వాతావరణం పరంగా రికార్డు గణాంకాలు నమోదయ్యాయి అని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. 1901 నుంచి ఇప్పటి వరకు మే నెలల్లో నమోదైన అతితక్కువ యావరేజ్ ఉష్ణోగ్రతల్లో గత మే నెల నాల్గవ స్థానం సాధించింది. గత 44 ఏళ్లలో అయితే ఇదే అత్యల్పం.

అలాగే 1901 నుంచి ఇప్పటి వరకు మే నెలల్లో కురిసిన అత్యధిక యావరేజ్ వర్షపాతంలో గత మే నెల 2 వ స్థానం సాధించడం విశేషం. అంటే భానుడిపై వరుణుడి పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 1990లో అత్యధిక వర్షపాతం నమోదైంది.