సూర్యుడి చుట్టూ అద్భుతం.. హైదరాబాద్ లో కనువిందు చేసిన 'సన్ హాలో'

  • IndiaGlitz, [Wednesday,June 02 2021]

బుధవారం హైదరాబాద్ నగరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. భగభగమండే భానుడి చుట్టూ అందమైన వలయంలా రైన్ బో ఏర్పడింది. కొన్ని గంటలపాటు ఈ రైన్ బో ప్రజలని కనువిందు చేసింది. ఆకాశంలో అప్పుడప్పుడు ఇంద్రధనుస్సులు ఏర్పడడం చూస్తూనే ఉన్నాం.

ఇలా సూర్యుడి చుట్టూ వృత్తంలాగా రైన్ బో ఏర్పడితే దానిని 'సన్ హాలో' అని పిలుస్తారు. చంద్రుడు చుట్టూకూడా ఇలాంటి వలయాలు ఏర్పడడం చూస్తూనే ఉన్నాం. సైన్స్ ప్రకారం దీనిని '22 డిగ్రీ సన్ హాలో' అని పిలుస్తారు. అంటే సూర్యుడి చుట్టూ 22 డిగ్రీల రేడియస్ తో ఈ వృత్తం ఏర్పడుతుంది.

ఇదీ చదవండి: ఆనందయ్య మందు పంపిణీకి డేట్ ఫిక్స్..!

మంగళవారం రాత్రి నగరంలో వర్షం కురిసింది. దీనితో వాతావరంలో నీటి బిందువులు ఉంటాయి. ఆ నీటి బిందువులని ఐస్ క్రిస్టల్స్ అంటారు. ఐస్ క్రిస్టల్ ద్వారా సూర్య కాంతి ప్రసరించినప్పుడు ఇలా సన్ హాలో ఏర్పడుతూ ఉంటుంది.

వాతావరణంలో ఉండే ఐస్ క్రిస్టల్స్ ని బట్టి సన్ హాలో విజుబులిటీ ఆధారపడి ఉంటుంది. చంద్రుడు చుట్టూ అయితే ఈ హాలో తెల్లగా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ ఎత్తులో ప్రయాణించే మేఘాలలో ఈ ఐస్ క్రిస్టల్స్ ఉంటాయట.

ఏది ఏమైనా హైదరాబాద్ నగరంలో ఏర్పడిన ఈ సన్ హాలో ప్రజలని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరూ ఈ సుందర దృశ్యాన్ని తమ ఫోన్ లలో బంధించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.