స్టార్ హీరోయిన్స్‌కు సమన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌కు సమన్లు అందించినట్లు సమాచారం. బాలీవుడ్ నుండి టాలీవుడ్, శాండిల్ వుడ్ సినీ ప్రముఖులకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు నార్కోటిల్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)కి ఆధారాలు లభించడంతో వారు కేసును వేగవంతం చేశారు. కొన్నిరోజులుగా ఇప్పటికే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, ఇతరులు అందించిన సమాచారంతో ఎన్‌సీబీ ఓ లిస్టును తయారు చేసింది. ఈ లిస్టులో దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్‌సింగ్, నమ్రత శిరోద్కర్ పేర్తు ఉన్నట్లు వార్తలు ప్రముఖంగా మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ లిస్టులో ఉన్నవారిలో నమ్రత శిరోద్కర్ మినహా మిగిలిన వారందరికీ సమన్లు అందాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి వీరు ఎన్‌సీబీ విచారణకు ఎప్పుడు హాజరవుతారనే విషయంపై వార్తలేమీ తెలియడం లేదు. ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరో వైపు నిర్మాత మధు మంతెనను ఎన్‌సీబీ బుధవారం రోజున విచారణ చేస్తున్నట్లు టాక్. మరి ఈయన నుండి నార్కోటిక్ విభాగం ఎలాంటి సమాచారాన్ని రాబడుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com