విశాల్ కు సమన్లు జారీ
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు రోజుల క్రితం జీఎస్టీ అధికారులు విశాల్ ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయం లో విశాల్ కార్యాలయం నుంచి కొన్ని కీలక ఆధారాలను అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది. తనిఖీల్లో విశాల్ రూ. 51 లక్షల పన్ను చెల్లించలేదని తేలినట్లు సమాచారం.
అయితే ఈ విషయమై రేపు అంటే 27వ తేదీన తమ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు విశాల్ కు సమన్లు జారీ చేసినట్లు తెలిసింది.
విశాల్ మాత్రం తన ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయన్నారు. ఒకవేళ తనపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
విశాల్ మెర్శల్ చిత్రానికి మద్దతు తెలపడం వల్లే ఆయన కార్యాలయంపై దాడులు జరిగాయంటున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.
తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మరియు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి అయిన విశాల్, తన సొంత సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో ఇప్పటివరకు ఆరు చిత్రాలు నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments