సుమంత్ విక్కీ డోన‌ర్ రీమేక్ వివ‌రాలు..

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

అక్కినేని మ‌న‌వ‌డు యార్ల‌గ‌డ్డ సుమంత్ ప్రేమ‌క‌థ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..స‌త్యం, గౌరి, పౌరుడు, గోల్కండ హైస్కూల్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి మెప్పించాడు. కానీ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయాడు. కొంత గ్యాప్ త‌రువాత ఇప్పుడు మ‌ళ్లీ హీరోగా త‌న అద్రుష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు సుమంత్.

బాలీవుడ్ లో విజ‌యం సాధించిన విక్కీ డోన‌ర్ మూవీ తెలుగు రీమేక్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంగీతం శ్రీ చ‌ర‌ణ్‌, సినిమాటోగ్ర‌ఫీ షానెల్. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్, ఎస్.ఎస్.క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. మ‌రి..కొంత గ్యాప్ త‌రువాత వ‌స్తున్న సుమంత్ విక్కీడోన‌ర్ తో విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.