రెండో పెళ్ళికి రెడీ అవుతున్న సుమంత్.. అమ్మాయి ఎవరంటే ?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జున ప్రోత్సాహంతో కెరీర్ ఆరంభంలో సత్యం లాంటి మంచి విజయాలే అందుకున్నాడు. కానీ ఆ తర్వాత సుమంత్ కెరీర్ కొద్దిగా ట్రాక్ తప్పింది. అయినప్పటికీ సుమంత్ వైవిధ్యమైన చిత్రాలతో కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
సుమంత్ చివరగా నటించిన కపటధారి చిత్రం ఆశించిన విజయం అందుకోలేదు. ఇదిలా ఉండగా సుమంత్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్న సంగతి తెలిసిందే. 2004లో సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. విభేదాలతో రెండేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి సుమంత్ సింగిల్ గానే ఉంటున్నాడు.
ప్రస్తుతం సుమంత్ వయసు 46ఏళ్ళు. ఎట్టకేలకు సుమంత్ తన ప్రేమని వెతుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో సుమంత్ రెండో వివాహానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. వెడ్డింగ్ కార్డులని కూడా స్నేహితులకు, బంధువులకు ఇస్తూ ఆహ్వానించడం ప్రారంభించారు.
సుమంత్ కి కాబోయే సతీమణి పేరు పవిత్ర. సుమంత్, పవిత్ర ఇద్దరూ కలసి వెడ్డింగ్ కార్డులు పంచుతూ పెళ్ళికి ఆహ్వానిస్తున్నారట. కేవలం బంధు మిత్రుల సమక్షంలో సుమంత్, పవిత్రల వివాహం ప్రైవేట్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. వెడ్డింగ్ కార్డులపై ఇద్దరి పేర్లు కలిసేలా 'SP' అని ఉన్నట్లు తెలుస్తోంది.
పవిత్ర ఫ్యామిలీ నేపథ్యం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. తన వివాహ శుభవార్తని బహుశా సుమంత్ త్వరలోనే అభిమానులకు తెలియజేస్తాడేమో. ప్రస్తుతం సుమంత్ అనగనగా ఒక రౌడీ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com