సుమంత్ చిత్రానికి 'కపటధారి' టైటిల్ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సుమంత్, ప్రదీప్ కృష్ణమూర్తి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రానికి `కపటధారి` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. `సుబ్రహ్మణ్యపురం`, `ఇదంజగత్` చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `కపటధారి` అనే ఎమోషనల్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కావలుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై ఈ డిఫరెంట్ పాయింట్‌తో రూపొందిన `కావలుధారి` చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో డా.ధనంజయన్ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్లో సుమంత్, నాజర్, నందిత, పూజా కుమార్, వెన్నెల కిషోర్, జయప్రకాశ్, సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ వెర్షన్లో ఇతర నటీనటులు నటిస్తున్నారు.
ఇటీవల విడులైన విజయవంతమై అర్జున్, విజయ్ ఆంటోని `కిల్లర్`చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నసైమన్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధనుంజయన్ స్క్రీన్‌ప్లే అడాప్షన్ చేస్తుండగా.. బాషాశ్రీ మాటలు అందిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్టర్‌గా , విదేశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. విజయ్ ఆంటోనితో భేతాళుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో విజయవంతమైన క్షణం చిత్రాన్ని తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్‌తో సత్య అనే పేరుతో తెరకెక్కించి తమిళంలోనూ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు ప్రదీప్ కృష్ణమూర్తి. ఇటీవల చెన్నైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతుంది. చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో జనవరిలో జరిగే సింగిల్ షెడ్యూల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. మార్చి నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు: సుమంత్, నందిత, పూజాకుమార్, నాజర్, జయప్రకాశ్, సంపత్, వెన్నెల కిషోర్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com