సుమంత్ కొత్త సినిమా టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీరావా` సినిమాతో విజయాన్ని అందుకున్నారు సుమంత్. ఆ సినిమాలో కార్తిక్గా సుమంత్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఫీల్ గుడ్ ఫిలింతో గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. అందుకే మళ్ళీ ఆ బాటలోనే తన తదుపరి చిత్రాన్ని కూడా తెరకెక్కించే అవకాశం మరో కొత్త దర్శకుడికే ఇచ్చారు సుమంత్. ఈ చిత్రంతో అనిల్ శ్రీకాంతం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
అలాగే ఈ సినిమా ద్వారా కేరళ కుట్టి అంజు కురియన్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ క్రైమ్ థ్రిల్లర్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేసే ప్రెస్ ఫోటోగ్రాఫరుగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు సుమంత్. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇదం జగత్` అనే టైటిల్ను ఖరారు చేసినట్టు సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇక వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో మూవీని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com