సుమంత్ నూతన చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,October 27 2017]

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న హీరో అక్కినేని సుమంత్. ఆయన హీరోగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది.విరాట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమాల సంయుక్త నిర్మాణంలో ఆలూరు సాంబశివా రెడ్డి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజు కురియన్ నాయికగా నటించనుంది. అనీల్ శ్రీకంఠం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో వైవిధ్యమైన నిలిచిపోయే చిత్రమిది.

క్రైం థిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలైట్‌గా వుంటుంది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా.. అందర్నీ అలరించేవిధంగా వుంటుంది. నవంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వైజాగ్,అరకు కేరళలో చిత్రీకరణ చేస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు. మురళీ శర్మ, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, మాటలు: చంద్రశేఖర్, సంగీతం: శ్రీచరణ్, నిర్మాతలు: ఆలూరు సాంబశివా రెడ్డి, గంగపట్నం శ్రీధర్, రచన-దర్శకత్వం: అనీల్ శ్రీకంఠం

More News

నాగ శౌర్య కొత్త చిత్రం టైటిలిదే..

"ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌వైభోగం"," జ్యోఅచ్చుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాయించాడు నాగ‌శౌర్య.

వెలుగులోకి మరో స్వామిజి రాసలీలల బాగోతం

బెంగుళూరు లో ఉన్న ఓ మఠంలో స్వామిజీ రాసలీలల వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ నిర్మాత పివిపికి పితృ వియోగం

ప్రముఖ పారిశ్రామికవేత్త-నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) నేడు దివంగతులయ్యారు.

విలేకరి ప్రశ్నకి అదిరిపోయే సమాధానమిచ్చిన సూపర్ స్టార్

రజనీకాంత్-అక్షయ్ కుమార్-శంకర్ ల చిత్రం 2.0 ఆడియోని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు దుబాయ్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' సెన్సార్ పూర్తి... నవంబ‌ర్ 3న విడుద‌ల‌

జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.