సుమంత్ నరుడా డోనరుడా రిలీజ్ డేట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా. ఈ చిత్రంలో సుమంత్ సరసన పల్లవి సుభాష్ నటించింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించారు.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
వీర్యదానం అనే కాన్సెప్ట్ ఆడియోన్స్ కు కొత్తగా ఉండడంతో నరుడా డోనరుడా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. 2 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి నరుడా డోనరుడా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియోన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆడియోన్స్ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెడుతూ... వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న రిలీజ్ చేయనున్నట్టు హీరో సుమంత్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. మరి... సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్ కి నరుడా డోనరుడా విజయాన్నిఅందిస్తుందని ఆశిద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments