షూటింగ్ పూర్తి చేసుకున్న సుమంత్ 'మళ్ళీ రావా'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఆశీస్సులతో..... స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సుమంత్ (హీరోగా),ఆకాంక్ష సింగ్ (బద్రినాద్ కి దుల్హనియా ఫేం) ప్రధాన పాత్రదారులుగా “గౌతమ్ తిన్ననూరి” దర్శకత్వం లో “రాహుల్ యాదవ్ నక్క” నిర్మించిన రొమాంటిక్ డ్రామా “మళ్ళీ రావా”. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయ్.
ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ..మేము కొత్తవారమైన కథ మీద నమ్మకంతో సుమంత్ గారు మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 30 డేస్ సింగిల్ షెడ్యుల్ లో ఈ మూవీ కంప్లీట్ చేయగలిగాం. దీనికి కారణం బిఫోర్ పదినెలలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం వల్లే ఈ సినిమా 30 రోజుల్లో తీయడానికి సాద్యపడింది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో లోగో, టీజర్ ను రిలీజ్ చేయనున్నాం.. అని తెలిపారు.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ కధను నమ్మి నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రొడ్యూసర్ రాహుల్ గారికి, హీరో సుమంత్ గారికి కృతజ్ఞతలు. సుమంత్ గారి కెరీర్ లో ఈ చిత్రం మంచి చిత్రం అవ్వాలని ,ఈ సినిమాకి పనిచేసిన అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. ఇది పక్కా కమర్షియల్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది...అని అన్నారు.
నటీనటులు,సాంకేతిక వర్గం:
సుమంత్ , ఆకాంక్ష సింగ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమిల్లి, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతీ అస్రాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి D.O.P: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ బరద్వాజ్, ఎడిటింగ్:సత్య గిడుతూరి, లిరిక్స్:కృష్ణ కాంత్ (K.K), నిర్మాత :రాహుల్ యాదవ్ నక్క, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com