దాత సుమంత్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో వీర్యదానానికి సంబంధించిన దాతగా చివరికి సుమంత్ పేరు ఫిక్స్ అయింది. హిందీలో బాగా హిట్ అయిన సినిమా విక్కీ డోనార్. ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆ సినిమాకు విమర్శకుల నుంచి సైతం విపరీతమైన ప్రశంసలు దక్కాయి.
ఆ సినిమాను తెలుగులో మధుర శ్రీధర్ రెడ్డి తెరకెక్కిస్తారని, అందులో నాని నటిస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు విక్కీ డోనార్గా సుమంత్ నటించనున్నారు. సుమంత్ గత కొంతకాలంగా సినిమాలేవీ చేయలేదు. తాజాగా ఈ సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమాతో మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డిసెంబర్ రెండో వారం నుంచి షెడ్యూల్ మొదలు కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com