ఒక పాట మినహా పూర్తయిన సుమంత్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
మళ్ళీ రావా చిత్రంతో చాలా కాలం తరువాత విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు సుమంత్. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ రెండు చిత్రాలే ఇదం జగత్, సుబ్రమణ్యపురం. ఇదం జగత్ సుమంత్ నటిస్తున్న 24వ సినిమా కాగా.. సుబ్రమణ్య పురం 25వ చిత్రం. ఇదం జగత్‌లో సుమంత్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ పాత్రలో సందడి చేయనున్నారు. రాత్రి పూట మాత్రమే పనిచేసే ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా తాజాగా టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. మిగిలి ఉన్న పాటను త్వరలోనే చిత్రీకరించనున్నారు. అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కేరళకుట్టి అంజు కురియన్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుంది. ఇక సుమంత్ 25వ చిత్రానికి వస్తే.. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభయ్యింది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments