సుమంత్ కన్‌ఫర్మ్ చేశాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన వర్క్ చాలా వేగంగా జరుగుతుంది. బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే చాలా మంది నటీనటులు నటిస్తున్నారు. రానా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించబోతున్నట్లు కన్‌ఫర్మ్ అయింది.
తాజాగా ఎ.ఎన్.ఆర్ పాత్రలో నటించబోతున్నట్లు సుమంత్ కన్‌ఫర్మ్ చేశారు. రీసెంట్‌గా ఎ.ఎన్.ఆర్ పాత్ర నుండి సుమంత్ తప్పుకున్నట్లు వార్తలు వినిపించినా.. ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ సుమంత్ తాతగారి పాత్రలో నటించబోతున్నట్లు ధృవీకరించారు. ఇప్పటికే చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ సినిమాలో విద్యాబాలన్, సచిన్ ఖేడేకర్ తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments