సుమంత్ ఈ సారీ హిట్ కొడతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
చాక్లెట్ బోయ్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడు అనే ట్యాగ్‌లైన్‌తో టాలీవుడ్లో హీరోగా అడుగులు వేసిన సుమంత్.. సినిమా సినిమాకి నటుడుగా ఎదుగుతున్నాడు. 'అంతకు ముందు ఆ తరువాత', 'లవర్స్', 'కేరింత' చిత్రాలతో విజయాలనూ తన ఖాతాలో వేసుకున్న ఈ యువ కథానాయకుడు నటిస్తున్న తాజా చిత్రం 'కొలంబస్'. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది దీనికి క్యాప్షన్. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. రచయిత రమేష్ సామల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు.
'చిన్నదానా నీకోసం' ఫేమ్ మిస్తీ, 'రన్ రాజా రన్' , 'టైగర్' చిత్రాల కథానాయిక సీరత్ కపూర్ ఇందులో హీరోయిన్లు. 'కేరింత' వంటి విజయవంతమైన చిత్రం తరువాత వస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడట సుమంత్. గతేడాది 'లవర్స్', 'చక్కిలిగింత'.. ఇలా రెండు సినిమాలు విడుదలైతే వాటిలో ఒకటి మాత్రమే సదరు యంగ్ హీరోకి హిట్ నిచ్చింది. ఈ ఏడాదిలోనూ రెండు సినిమాల పరంపరని కొనసాగిస్తున్న సుమంత్ 'కేరింత' తరువాత వస్తున్న 'కొలంబస్'తోనూ హిట్ కొడతాడేమో చూడాలి. ఆల్ ది బెస్ట్ సుమంత్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com