పెళ్లి వార్తలపై సుమంత్ క్లారిటీ.. వెడ్డింగ్ కార్డు వెనుక ఇంత జరిగిందా!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ న్యూస్ అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో వైరల్ అయింది. ఆ వార్తలకు బలాన్నిస్తూ సుమంత్ వెడ్స్ పవిత్ర అనే వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనితో సుమంత్ పవిత్ర అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు అంతా భావించారు.
ఇదీ చదవండి: RRR: నా మైండ్ లోనుంచి పోవట్లేదు.. 'దోస్తీ' సాంగ్ పై హేమచంద్ర
అక్కినేని ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే రాంగోపాల్ వర్మ ఒకడుగు ముందుకు వేసి సుమంత్ ని దారుణంగా తిట్టడం చూశాం. ఒక పెళ్లి చేసుకున్నావ్ ఇంకా బుద్దిరాలేదా సుమంత్ ? అంటూ దారుణంగా వర్మ సుమంత్ పై విరుచుకుపడ్డారు. పెళ్లి దండగ అని.. దయచేసి మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు అని సుమంత్ కి సూచించాడు.
సుమంత్ పెళ్లి వార్తల్లోకి ఆర్జీవీ ఎంటర్ కావడంతో ఇది ఇంకా హాట్ న్యూస్ గా మారిపోయింది. దీనితో సుమంత్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తన వెడ్డింగ్ రూమర్స్ వెనుక ఉన్న అసలు సంగతిని బయట పెట్టిన సుమంత్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఓ చిన్న వీడియో బైట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ' నేను మళ్ళి పెళ్లి చేసుకుంటానని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇస్తున్నా. రియల్ లైఫ్ లో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదు. అనుకోకుండా నా తదుపరి చిత్రం పెళ్లి, విడాకులపై తెరకెక్కుతోంది. ఆ చిత్ర షూటింగ్ నుంచి ఓ వెడ్డింగ్ కార్డు లీకైంది. దీనితో అందరూ నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానని తప్పుగా భావించారు. ఈ గందరగోళానికి కారణం అదే. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. థ్యాంక్యూ అంటూ సుమంత్ క్లారిటీ ఇచ్చాడు.
సో మ్యాటర్ అర్థం అయిందిగా. మొత్తానికి సుమంత్ మ్యారేజ్ రూమర్ వల్ల అతడి సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ లభించినట్లు అయింది. సుమంత్ రియల్ లైఫ్ లో 2004లో కీర్తి రెడ్డిని వివాహం చేసుకుని విడాకులతో విడిపోయారు. అప్పటి నుంచి సుమంత్ సింగిల్ గానే ఉంటున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments