'కొలంబస్' గా రెడీ అవుతున్న సుమంత్ అశ్విన్

  • IndiaGlitz, [Sunday,September 27 2015]

లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం 'కొలంబస్'. 'డిస్కవరీ ఆఫ్ లవ్' అనేది ఉపశీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ఇందులో కథానాయికలు. ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ''ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరి. ఇందులో నా పాత్ర చాలా లవ్లీగా, లైవ్లీగా ఉంటుంది. ఇటు యూత్ అటు ఫ్యామిలీస్ కి నచ్చే విధంగా ఉంటుంది. మంచి నటన కనబర్చడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా తీశారు. 'కేరింత' వంటి విజయం తర్వాత నేను చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ - ''అనుకున్న విధంగా షూటింగ్ పూర్తయ్యింది. దర్శకుడు ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు. ఇందులో సుమంత్ అశ్విన్ క్యారెక్టర్ చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. సుమంత్ అశ్విన్ సక్సెస్ పరంపరంను కొనసాగించే చిత్రం ఇది. ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. వచ్చే నెల ద్వితీయార్థంలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. నవంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

More News

మహేష్ ... మాట తప్పలేదు...

'శ్రీమంతుడు' సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత తీసున్నట్లే హీరో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

రజనీకాంత్ రిలీజ్ డేట్ ఫిక్సయింది...

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పారంజిత్ దర్శకత్వంలో 'కబాలి'అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

'హరికథ' కాన్సెప్ట్ అదేనట...

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'శివమ్'విడుదల్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే 'హరికథ'చిత్రంపై ఫుల్ కాన్ సన్ ట్రేషన్ చేయబోతున్నాడు.

శానిఫ్రాన్సిస్కోలో 'అఖిల్' ఆడియో విడుదల

మహానటుడు అక్కినేని మనవడు,కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో

శ్రీవాస్ కు థ్యాంక్స్ చెబుతున్న రకుల్...

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్...రామ్ చరణ్ తో బ్రూస్ లీ,ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో,బన్నితో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ...ఫుల్ బిజీగా ఉంది.