13న దీపికతో సుమంత్ అశ్విన్ వివాహం: ఎంఎస్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
‘తునీగ తునీగ’, ‘కేరింత’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన లవర్ బోయ్ సుమంత్ అశ్విన్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడైన సుమంత్ అశ్విన్ వివాహం చాలా సింపుల్‌గా జరగనుంది. హైదరాబాద్‌కి చెందిన దీపిక అనే యువతిని ఫిబ్రవరి 13న సుమంత్ వివాహం చేసుకోబోతున్నాడు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది. కరోనా నిబంధనల కారణంగా సుమంత్ అశ్విన్ తండ్రి ఎంఎస్ వివాహ వేడుకను అతి కొద్ది మంది అతిథుల సమక్షంలోనే నిర్వహించాలని భావించారు.
తన కొడుకు వివాహ వేడుక గురించి ఎంఎస్ రాజు పలువురు సెలబ్రిటీలకు మెసేజ్‌ల ద్వారా వెల్లడించినట్టు తెలుస్తోంది. తాజాగా ఎంఎస్ రాజు తన ట్విట్టర్ ద్వారా సుమంత్ వివాహ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ‘‘మా కుమారుడు సుమంత్ వివాహం దీపికతో ఫిబ్రవరి 13న జరగనుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాహాన్ని ఓ ప్రైవేటు వేడుకలానే నిర్వహించాలని భావిస్తున్నాం. ఈ వివాహ వేడుకలో మిమ్మల్ని మేము మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నాం’’ అని ఎంఎస్ రాజు ట్వీట్ చేశారు. సుమంత్ ప్రస్తుతం శ్రీకాంత్, తాన్యా హోప్‌తో కలిసి `ఇది మా కథ` సినిమాలో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments