తెలుగు »
Interviews »
అలా చెప్పగానే...రజనీకాంత్ గుర్తుకువచ్చారు..మోహన్ లాల్ ని ఫాలో అయ్యాను - సుమంత్ అశ్విన్
అలా చెప్పగానే...రజనీకాంత్ గుర్తుకువచ్చారు..మోహన్ లాల్ ని ఫాలో అయ్యాను - సుమంత్ అశ్విన్
Wednesday, June 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తూనీగ తూనీగ చిత్రంతో హీరోగా పరిచయమై...అంతకు ముందు ఆతర్వాత, కేరింత, కొలంబస్...తదితర చిత్రాలతో విజయాలు సాధించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నయువ కథానాయకుడు సుమంత్ అశ్విన్. తాజాగా సుమంత్ అశ్విన్, పూజా జావేరి, బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో మను తెరకెక్కించిన చిత్రం రైట్ రైట్. మలయాళంలో విజయం సాధించిన ఆర్డినరీ చిత్రాన్ని రైట్ రైట్ టైటిల్ తో తెలుగులో వంశీకృష్ణ రీమేక్ చేసారు. శ్రీ సత్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన రైట్ రైట్ చిత్రాన్ని ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రైట్ రైట్ హీరో సుమంత్ అశ్విన్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
రైట్ రైట్ ఈ నెల 10న రిలీజ్ కాబోతుంది. ఎలా ఫీలవుతున్నారు..?
ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. దృశ్యం, క్షణం..ఇలా కొత్తదనంతో వచ్చిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. కొత్త కథతో వస్తున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అయితే మా సినిమాకి ఎలాంటి రిజెల్ట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఫస్ట్ టైమ్ కండక్టర్ క్యారెక్టర్ చేసారు కదా..ఏమనిపించింది..?
కండక్టర్ క్యారెక్టర్ చేయాలి అనగానే నాకు రజనీకాంత్ గారే గుర్తుకువచ్చారు. కండక్టర్ సామాన్య జనానికి బాగా తెలిసిన వ్యక్తి. అందుచేత ఈ క్యారెక్టర్ చేస్తే క్లిక్ అవుతుంది అందరికీ రీచ్ అవుతుంది అనిపించింది. ఈ సినిమా చేసిన తర్వాత ఓ పది సంవత్సరాల పాటు ఈ పాత్ర గుర్తుండిపోతుంది అనిపించింది.
కండక్టర్ పాత్ర కోసం హోమ్ వర్క్ ఏమైనా చేసారా..?
డైరెక్టర్ మను మోహన్ లాల్ 20 ఏళ్ల క్రితం నటించిన ఓ సినిమా చూపించారు. అందులో మోహన్ లాల్ కండక్టర్ కాదు కానీ..ఆఫీసర్ గా నటించారు. ఆయన బాడీలాంగ్వేజ్ పరిశీలించాను. అలాగే సిటీలో ఆర్.టి.సి బస్ ఎక్కి కండక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసాను. షూటింగ్ లో ఫస్ట్ టు డేస్ కష్టమనిపించింది. ఆతర్వాత మూడో రోజు నుంచి ఎంజాయ్ చేస్తూ చేసాను. అందరకీ నచ్చుతుంది అనుకుంటున్నాను.
రైట్ రైట్ కథ ఏమిటి..?
ఈ చిత్రంలో పోలీస్ అవ్వాలనుకుని కండక్టర్ అవుతాను. పల్లెటూరులో జరిగే కథ ఇది. ఇక పల్లెటూరు పెద్దగా నాజర్ నటించారు. ఈ పల్లెటూరులో సెల్ ఫోన్ కూడా ఉండదు. అలాంటి ఊరులో ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏమిటి..? దీని వలన కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది తెర పైనే చూడాలి.
రైట్ రైట్ ప్రమోషన్స్ లో మీరు, ప్రభాకర్ కండక్టర్, డ్రైవర్ గెటప్స్ లోనే కనిపిస్తున్నారు. బాలీవుడ్ ప్రమోషన్స్ ఫాలో అవుతున్నారా..?
ఒక రోజు షూటింగ్ చేస్తున్నప్పుడు నేను, ప్రభాకర్ ప్రమోషన్స్ కూడా ఇదే గెటప్స్ తో చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అలా చేస్తున్నాం అంతే కానీ...బాలీవుడ్ ప్రమోషన్ స్టైల్ ఫాలో అవ్వాలి అనుకుని చేస్తుంది కాదు..!
కాళికేయ ప్రభాకర్ పాత్ర ఎలా ఉంటుంది..?
ప్రభాకర్ ఈ చిత్రంలో డ్రైవర్ పాత్ర పోషించారు. ప్రభాకర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేసాను. ఫస్ట్ టు డేస్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆతర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. మంచి పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. ఈ పాత్రలకు పూర్తి న్యాయం చేయాలి అనుకున్నాం. ఆతర్వాత నుంచి మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరింది.ఈ సినిమా ప్రభాకర్ కి మంచి పేరు తీసుకువస్తుంది.
డైరెక్టర్ మను గురించి..?
డైరెక్టర్ మను కో - డైరెక్టర్ గా కమల్ హాసన్, మోహన్ లాల్, వెంకటేష్...ఇలా ఎంతో మంది సీనియర్స్ తో వర్క్ చేసారు. ఎంతో మంది సీనియర్స్ తో వర్క్ చేసిన అనుభం ఉన్న డైరెక్టర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మనుకి సినిమాకి సంబంధించి అన్నివిషయాల పై ఫుల్ క్లారిటి ఉంది. ఖచ్చితంగా మను మంచి దర్శకుడు అవుతాడు.
రైట్ రైట్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి..?
కొంత మంది శ్రీమంతుడు సినిమాలో ఇంటర్వెల్ సీన్ కి ముందు మహేష్ బాబు రైట్ రైట్ అంటారు. అది చూసి మేము ఈ టైటిల్ పెట్టాం అనుకుంటున్నారు. కానీ సంవత్సరం క్రితమే ఈ టైటిల్ రిజిష్ట్రేషన్ చేసాం. నేను కండక్టర్, ప్రభాకర్ డ్రైవర్ కథ కు సరిగ్గా సరిపోయే టైటిల్. అందుకే రైట్ రైట్ అని టైటిల్ పెట్టాం.
రైట్ రైట్ చూసి మీ నాన్నగారు ఏమన్నారు..?
నాన్నగారు సినిమా చూసి స్మైల్ ఇస్తే..ఆ సినిమా సేఫ్, అదే షేక్ హ్యాండ్ ఇస్తే సూపర్ హిట్ అని అర్ధం. ఈ సినిమా చూసి దృశ్యం, క్షణం చిత్రాల వలే మంచి చిత్రంగా నిలుస్తుంది. సెకండాఫ్ లో లాస్ట్ వన్ అవర్ చాలా బాగుంది అని చెప్పారు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
రెండు చిత్రాల కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి వివరాలు తెలియచేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments