అందుకే కొలంబస్ కి కనెక్టాయ్యాడట...
Send us your feedback to audioarticles@vaarta.com
సుమంత్ అశ్విన్ తాజా చిత్రం కొలంబస్. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ట్యాగ్ లైన్.ఏ.కె.ఎస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఆర్.సామల దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొలంబస్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా కొలంబస్'
విశేషాలను సుమంత్ అశ్విన్ చెబుతూ - ''లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాల తర్వాత నేను చేసిన చిత్రం ఇది. కథ విని, వెంటనే అంగీకరించేంతగా ఈ కథ నన్ను ఎగ్జయిట్ మెంట్ కి చేసింది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఉన్న కథ. అందుకే కనెక్ట్ అయిపోయాను. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది. నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుందన్నారు.
ఈ చిత్రంలో సుమంత్ సరసన 'రన్ రాజా రన్' ఫేం సీరత్ కపూర్, 'చిన్నదాన నీ కోసం'లో చేసిన మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటించారు. 'ఇష్క్' సినిమాకి రచయితగా పని చేసిన ఆర్. సామల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా కొలంబస్ రూపొందుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో పాటలను, నవంబర్ మొదటి వారంలో సినిమాని విడదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com