అందుకే కొలంబస్ కి కనెక్టాయ్యాడట...

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

సుమంత్ అశ్విన్ తాజా చిత్రం కొలంబ‌స్. డిస్క‌వ‌రీ ఆఫ్ ల‌వ్ అనేది ట్యాగ్ లైన్.ఏ.కె.ఎస్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఆర్.సామ‌ల ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌నీ కుమార్ స‌హ‌దేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొలంబ‌స్ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా కొలంబస్'

విశేషాలను సుమంత్ అశ్విన్ చెబుతూ - ''లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాల తర్వాత నేను చేసిన చిత్రం ఇది. కథ విని, వెంటనే అంగీకరించేంత‌గా ఈ కథ నన్ను ఎగ్జయిట్ మెంట్ కి చేసింది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఉన్న కథ. అందుకే కనెక్ట్ అయిపోయాను. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది. నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుందన్నారు.

ఈ చిత్రంలో సుమంత్ స‌ర‌స‌న‌ 'రన్ రాజా రన్' ఫేం సీరత్ కపూర్, 'చిన్నదాన నీ కోసం'లో చేసిన మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటించారు. 'ఇష్క్' సినిమాకి రచయితగా పని చేసిన ఆర్. సామల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా కొలంబ‌స్ రూపొందుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో పాటలను, నవంబర్ మొదటి వారంలో సినిమాని విడదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

More News

మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3 ప్రారంభం ఎప్పుడు...?

టాలీవుడ్ కింగ్ నాగార్జున... మీలో ఎవరు కోటీశ్వరుడుతో సక్సెస్ సాధించి వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా ఆకట్టుకోగలని నిరూపించి ప్రేక్షక హ్రుదయాల్లో చెరగని ముద్రవేశారు.

రీ రికార్డింగ్ పనుల్లో 'పులి'

కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి.స్వెకుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘పులి’.

సర్ధార్ సెట్సలో పవన్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మాత.

నా కెరీర్ లోనే డిఫరెంట్ రోల్ - నయనతార

'చంద్రకళ', 'పిశాచి', 'ఉత్తమవిలన్‌', రీసెంట్‌గా 'జ్యోతిలక్ష్మీ' వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ తాజాగా నయనతార ప్రధాన పాత్రలో 'మయూరి' చిత్రాన్ని నిర్మించారు.

సెప్టెంబర్ 18న 'అప్పుడలా ఇప్పుడిలా' ఆడియో

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు.