సుమంత్ 25వ సినిమా చిత్రీకరణ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల 'మళ్ళీ రావా' వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'ఇదంజగత్' సినిమా ఒకటి. కాగా.. సుమంత్ 25వ చిత్రం 'సుబ్రహ్మణ్యపురం' మరొకటి. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈషా కథానాయికగా నటిస్తున్నది. . లెటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ భావిస్తోంది.
సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. సుమంత్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com