రెండేళ్ళ కేసీఆర్ పాలన అద్భుతం : సుమన్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ పాలనలో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు. అరవై సంవత్సరాలు తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి, బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు. కేసీఆర్ పాలన అద్భుతంగా ఉంది. సామాన్య ప్రజలకు మేలు చేసే పథకాలు ప్రవేశపెడుతూ రికార్డ్ స్థాయిలో వాటిని పూర్తిచేస్తున్న కేసీఆర్ కు అభినందనలు అని సుమన్ అన్నారు.
హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ది చేయడానికి, ఐటి రంగంలో భారతదేశంలోనే నంబర్ వన్ గా నిలపడానికి కృషి చేస్తున్నారని సుమన్ పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ ను కేవలం తెలుగు చిత్రపరిశ్రమకే కాకుండా, ప్రపంచ సినిమాకు హబ్ గా మారుస్తూ అనేక ప్రోత్సహకాలు అందిస్తున్నారు. దీనివల్ల సినీ పరిశ్రమలో ఉత్సాహం కనిపిస్తోంది. భవిష్యత్తులో చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ది చెందుతుందని సుమన్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com