ప్రకాష్ రాజ్ పై 'నాన్ లోకల్' విమర్శలు.. సుమన్ రియాక్షన్ ఇదే!

  • IndiaGlitz, [Thursday,July 01 2021]

త్వరలో జరగబోయే 'మా' అసోసియేషన్ ఎన్నికలపై టాలీవుడ్ లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈసారి అనూహ్యంగా ప్రకాష్ రాజ్, హీరో విష్ణు, జీవిత, హేమ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

నాగబాబు, బండ్ల గణేష్ లాంటి ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆ విమర్శలని తిప్పికొట్టారు. వీరికి పోటీగా నరేష్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనితో మా ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ఇదిలా ఉండగా సీనియర్ హీరో సుమన్ పరోక్షంగా ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపారు.

ఇదీ చదవండి: త్రిశూలాల మధ్యలో నాని.. 'శ్యామ్ సింగ రాయ్' ఫైనల్ షెడ్యూల్

హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ లోకల్, నాన్ లోకల్ విమర్శలపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే అని సుమన్ అన్నారు. స్థానికత పేరుతో విమర్శలు చేయకూడదు.

వైద్యులు, రైతులు కూడా తాము నాన్ లోకల్ అనుకుంటే ప్రజలకు వైద్యం, ఆహారం అందుతాయా అని ప్రశ్నించారు. తెలుగు సినిమా నటీనటులంతా కలసి ఉండాలని సూచించారు. నేడు డాక్టర్స్ డే సంధర్భంగా హైదరాబాద్ అమీర్ పేట్ లో ప్రైమ్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు.

More News

త్రిశూలాల మధ్యలో నాని.. 'శ్యామ్ సింగ రాయ్' ఫైనల్ షెడ్యూల్

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. థియేటర్లు తెరుచుకోగానే ఆ చిత్రం రిలీజ్ కానుంది.

న్యూడ్ పార్టీలు, సెక్సువల్ రిలేషన్ షిప్స్.. బిల్ గేట్స్ అసలు రంగు ఇదే!

గత నెలలో తామిద్దరం విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్,

కరోనా ఎక్కువగా ఉన్నప్పుడు సెలవు పెట్టమని చెప్పా.. కానీ నా భర్త..

హీరోయిన్ సంజన గల్రాని గత ఏడాది లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకుంది.

దుబ్బాకలో హృదయ విదారక ఘటన.. ఆపద్భాంధవుడైన సంపూర్ణేష్ బాబు

నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు.. తన సేవ కార్యక్రమాలు, పెద్ద మనసుతో అభిమానుల హృదయాల్లో స్థానం దక్కించుకుంటున్నాడు.

పిక్ టాక్: బికినీ ఫోజుతో నెట్టింట తుఫాన్ సృష్టించిన బాలయ్య హీరోయిన్

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు.