ప్రకాష్ రాజ్ పై 'నాన్ లోకల్' విమర్శలు.. సుమన్ రియాక్షన్ ఇదే!
Send us your feedback to audioarticles@vaarta.com
త్వరలో జరగబోయే 'మా' అసోసియేషన్ ఎన్నికలపై టాలీవుడ్ లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈసారి అనూహ్యంగా ప్రకాష్ రాజ్, హీరో విష్ణు, జీవిత, హేమ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
నాగబాబు, బండ్ల గణేష్ లాంటి ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆ విమర్శలని తిప్పికొట్టారు. వీరికి పోటీగా నరేష్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనితో మా ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ఇదిలా ఉండగా సీనియర్ హీరో సుమన్ పరోక్షంగా ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: త్రిశూలాల మధ్యలో నాని.. 'శ్యామ్ సింగ రాయ్' ఫైనల్ షెడ్యూల్
హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ లోకల్, నాన్ లోకల్ విమర్శలపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే అని సుమన్ అన్నారు. స్థానికత పేరుతో విమర్శలు చేయకూడదు.
వైద్యులు, రైతులు కూడా తాము నాన్ లోకల్ అనుకుంటే ప్రజలకు వైద్యం, ఆహారం అందుతాయా అని ప్రశ్నించారు. తెలుగు సినిమా నటీనటులంతా కలసి ఉండాలని సూచించారు. నేడు డాక్టర్స్ డే సంధర్భంగా హైదరాబాద్ అమీర్ పేట్ లో ప్రైమ్ హాస్పిటల్స్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout