నువ్వు నా బలం, సంతోషం: రాజీవ్‌కు సుమ శుభాకాంక్షలు
Send us your feedback to audioarticles@vaarta.com
యాంకర్ సుమ కనకాల తన భర్త రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తన భర్తే తన బలం, సంతోషమని సుమ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. రాజీవ్‌తో ఉన్న ప్రతి రోజూ తనకు కొత్తగానే ఉంటుందని తెలిపింది. ‘‘మై డియరెస్ట్ రాజా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా బలం, సంతోషం. నీతో ఉండేందుకు నేను పెట్టి పుట్టాను. నీతో కలిసి ఉన్న ప్రతిరోజూ నేనొక కొత్త రోజుగా భావిస్తూ ఉంటాను. లవ్ యూ, మై డియర్ రాజా కనకాల నేను నీతోనే ఏకాంతంగా ఉన్నాను డియర్’’ అంటూ పోస్ట్ పెట్టింది.
కాగా.. రాజీవ్ కనకాల నుంచి సుమ విడిపోయిందని.. వారిద్దరూ కొంతకాలంగా విడిగానే ఉంటున్నారంటూ ఆ మధ్య కాలంలో వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు కానీ తాము కలిసే ఉన్నామన్నట్టుగా కొన్ని షోస్‌కి జంటగా హాజరై అలరించారు. తాము ఎప్పుడూ విడిపోలేదని.. కలిసే ఉన్నామని చెప్పకనే చెప్పారు. కాగా.. నేడు రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా సుమ ఇన్‌స్టాలో శుభాకాంక్షలు చెప్పి తన ప్రేమను చాటుకుంది. అభిమానులు సైతం రాజీవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout