వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుమ.. అసలు నిజమిదే..!
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4 ఆదివారం రిలీజ్ చేసిన ప్రోమో చూసి అంతా షాక్ అయ్యారు. యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారంటూ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమోపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బిగ్‌బాస్ యాజమాన్యం కావల్సిన దానికంటే నేటి షోకి ఎక్కువే హైప్‌ను తీసుకు రాగలిగిందనే చెప్పాలి. వైల్డ్ కార్డ్ అవడానికి ఎలా ఒప్పుకున్నావని హోస్ట్ నాగార్జున అడిగితే.. పాండమిక్ చాలా మార్పులు తీసుకొచ్చింది సర్ ఈ ప్రపంచంలో అందుకని’ అని చెప్పింది. దాదాపు 4 నిమిషాలున్న ఈ ప్రోమోలో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందుకే సినిమాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా.. టీవీలో ఏ షో జరిగినా నిర్వాహకుల ఫస్ట్ ఛాయిస్ సుమే ఉంటుంది. యాంకరింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ ఆమెను కొట్టగలిగే వారు లేరు.
ఇక బిగ్‌బాస్ విషయానికి వస్తే సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిజమా? కాదా? అంటే కాదనే చెప్పాలి. సుమ ఒక రోజు జస్ట్ 2-3 గంటల పాటు యాంకరింగ్ చేస్తే తీసుకునే రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుంది. అలాంటి సుమను వారాల తరబడి హౌస్‌లో ఉంచి ఆమెకు తగిన రెమ్యునరేషన్‌ను బిగ్‌బాస్ యాజమాన్యం చెల్లించగలదా? అది అసలు సాధ్యమేనా? పాండమిక్ మార్పులు తీసుకొచ్చింది అని సుమ చెప్పింది. కానీ పాండమిక్ కారణంగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో సుమ ఉందా? అంతే కాదు.. ఇప్పుడు తిరిగి తన షోలను సుమ కంటిన్యూ చేస్తోంది. మరి వాటన్నింటినీ వదులుకుని.. వాటికి కామా పెట్టేసి బిగ్‌బాస్‌కి వైల్డ్ కార్డ్‌గా వస్తుందా? అంటే 99.9% రాదనే చెప్పాలి. లేదంటే ఆమెను బిగ్‌బాస్ యాజమాన్యం ఒక వారానికి ఏమైనా కమిట్ చేయించి తీసుకొచ్చి ఉంటే చెప్పలేం. ఏదిఏమైనా దీనికి 0.1 శాతం మాత్రమే అవకాశం ఉంది.
ఇక సుమ ప్రోమోలో కనిపించి కాసేపట్లో మెహబూబ్‌కి పంచ్ ఇచ్చింది. ఇక అవినాష్ సుమను తన చిన్నప్పటి నుంచి చూస్తున్నానంటే.. నాగ్ తన చిన్నప్పటి నుంచి చూస్తున్నానంటూ ఆమెను ఆటపట్టించారు. అరియానాకు ‘టీ పొంగించకుండానే.. బాగా నీట్‌గానే తుడుస్తాను అరియానా’ అంటూ షాక్ ఇచ్చింది. నువ్వు ‘చప్పు.. చప్పాలి’ అంటూ మోనాల్‌కు.. ఏ సీజన్‌లోనూ కెప్టెన్‌కి అసిస్టెంట్‌ను చూడలేదంటూ అమ్మకు పంచ్ లిచ్చింది. ఇక లాస్య అడిగిన ప్రశ్నకు సుత్తి ప్రశ్నకు స్పాంటీనియస్‌గా సమాధానం ఇచ్చింది. లాస్యది కవరింగ్ స్మైల్ అని చెప్పింది. అభికి ‘నేను లోపలకు రాకముందే ఇంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే.. లోపలకు వస్తే ఎలా ఉంటుందో చూడు’ అని చెప్పింది. ‘సొహైల్ నేను ఆడ అంటాడని.. మాకు తెలుసు నువ్వు మగ అని’ అంటూ సెటైర్ వేసింది. ఇక అఖిల్ పాట పాడాడు. సుమతో నాగ్.. ‘నీకోసం ఎవరైనా ఇలా పాడారా?’ అని అడిగితే.. ‘పాడారు.. అలా పాడాకే నేను రెండు జోల పాటలు పాడాను’ అని స్పాంటీనియస్‌గా సుమ రిప్లై ఇచ్చింది. ‘ఇది ఒక చిన్న ప్రోమో మాత్రమే.. సినిమా అభి బాకీ హై.. లోపలికి వస్తున్నా’ అని సుమ చెప్పింది. నిజంగా ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తుందో లేదంటే షోకి హైప్ తీసుకు రావడానికి అలా క్రియేట్ చేశారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments