బుల్లితెర పై సుమ సరికొత్త సంచలనం..

  • IndiaGlitz, [Monday,July 11 2016]

ఆడియో ఫంక్ష‌న్స్ కు, టీవీ ప్రొగ్రామ్స్ కు యాంక‌ర్ గా ప‌లు కార్య‌క్ర‌మాలు చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే మ‌ల్టీటాలెంటెడ్ సీనియ‌ర్ యాంక‌ర్ సుమ‌. ఏ ప్రొగ్రామ్ కైనా యాంకరింగ్ సుమ చేసింది అంటే...ఆ ప్రొగ్రామ్ స‌క్సెస్ అయిన‌ట్టే. అప్ప‌టిక‌ప్పుడు త‌న మాట‌ల‌తో అంద‌ర్నీఆక‌ట్టుకునే సుమ బుల్లితెర పై ఏం చేసినా సంచ‌ల‌న‌మే.
తాజాగా బుల్లితెర పై స‌రికొత్త సంచ‌ల‌నానికి శ్రీకారం చుట్టింది. ఇంత‌కీ సుమ ఏం చేస్తుంది అంటే...యాంక‌ర్ సుమ కాస్త సింగ‌ర్ సుమ‌గా మారుతుంది. మాటీవీ రూపొందిస్తున్న సెల్ మీ ద ఆన్స‌ర్ అనే న్యూ గేమ్ షో కోసం సుమ పాట పాడింది.ర‌వికాంత్ రాసిన పాట‌ను సుమ పాడ‌గా సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె నేతృత్వంలో రికార్డ్ చేసారు. సుమ తొలిసారి పాట పాడింద‌ని సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేయ‌డంతో విశేష స్పంద‌న ల‌భిస్తుంది. మ‌రి...బుల్లితెర పై సంచ‌ల‌నం సృష్టిస్తున్న యాంక‌ర్ సుమ కాస్త సింగర్ సుమ‌గా బిజీ అవుతుందేమో చూడాలి.