హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కుటుంబం నుంచి ఓ యంగ్ హీరో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. రాజీవ్, సుమల ముద్దుల తనయుడు రోషన్ కార్తీక్ కనకాల. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఓ సినిమా ద్వారా రోషన్ వెండితెరకు పరిచయం కానున్నాడు. రోషన్‌ను హీరోగా ఎంట్రీ ఇప్పించేందుకు కొత్త వారితోనే ప్రయోగం చేయబోతున్నారు. నూతన దర్శకుడు విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. విజయ్ చెప్పిన కథకు ఫిదా అయిన సుమ రాజీవ్ తమ కుమారుడిని హీరోగా లాంచ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం తాజాగా పూర్తయ్యాయి.
సుమ, రాజీవ్ కనకాలతో పాటు చిత్రయూనిట్ అందరూ వినాయకుడి గుడిలో పూజలు చేశారు. స్క్రిప్ట్‌కు సైతం ప్రత్యేకంగా పూజ జరిపించారు. ఆ తరువాత రాజీవ్.. విజయమాలలను దర్శకుడు, నిర్మాతలు, హీరోకు వేశాడు. కాగా.. తన తనయుడి ఆరంగేట్రం గురించి వెల్లడిస్తూ రాజీవ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘‘ఫిలిం ఇండస్ట్రీలో నా కుమారుడు రోషన్ కార్తీక్ కనకాల అడుగు పెడుతున్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రోషన్ నటిస్తున్న మొదటి చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నూతన డైరెక్టర్ విజయ్.. దర్శకత్వం వహించనున్నారు. ఇతర వివరాలన్నీ త్వరలోనే ప్రకటిస్తాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలు రోషన్‌కు అందిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ రాజీవ్ పోస్ట్ పెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com