సోదాలు ఏమి జరగలేదు: సుమ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి, యాంకర్లు సుమ కనకాల, అనసూయ భరద్వాజ్ ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు GST అధికారులు. సర్వీస్ టాక్స్, GST చెల్లించడం లేదని సోదాలు నిర్వహించారు. దీంతో లావణ్య త్రిపాఠి షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఇంటికి చేరుకున్నారు. వీరితో పాటు హైదరాబాద్ లో దాదాపు 23 చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరిగినట్లు తెలిసింది. లావణ్య, సుమ, అనసూయలు కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని... అయితే ఆ సంస్థలు టాక్స్ చెల్లించడం లేదని సమాచారం.
అయితే ఈ విషయం పై యాంకర్ సుమ స్పందించారు. తమ నివాసంలో GST అధికారులు సోదాలు చేపట్టారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎప్పటికప్పుడు GST చెల్లిస్తూ వస్తున్నానని స్పష్టం చేశారు. వినోద రంగంలో అత్యధిక GST పే చేస్తున్న వారిలో నేనూ ఉన్నానని తెలిపారు సుమ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout