బన్నిని కొత్త పాత్రలో చూపించనున్న సుక్కు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోయే ఈ చిత్రం బన్ని ఓ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడట.
అందులో శేషాచల అడవుల బ్యాక్‌డ్రాప్ సెట్‌ను కూడా ఎలా వేసుకోవాలని సుకుమార్ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడట. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఓ బందిపోటు అవతారంలో బన్ని ఎలా తిరుగుబాటు చేశాడనేదే కథాంశం అని వార్తలు వినపడుతున్నాయి.
ఈ కథను మహేష్ రిజెక్ట్ చేస్తే బన్ని ఒప్పుకున్నాడట. బన్ని, త్రివిక్రమ్ సినిమాలో బన్ని పోర్షన్ ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో పూర్తవగానే సుకుమార్ ప్రాజెక్ట్‌లోకి బన్ని రానున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com